మొత్తానికి నాని నమ్మకం నిజమైంది. 'కోర్ట్'లో న్యాయం గెలిచింది.
ఔరంగజేబు గురించో, అమెరికా గురించో తెలుసుకొనే ముందు - మన చట్టాల గురించీ, అందులోని క్లాజుల గురించీ క్లాసుల్లో చెప్పాలి. అప్పుడు కదా... ఏది తప్పో, ఏది ఒప్పో పిల్లలకు తెలుస్తుంది. 'కోర్ట్' చెప్పేది కూడా అదే.
ప్రియదర్శి ఇంటెన్స్ ఉన్న పాత్రని సిన్సియర్ గా చేశాడు.
సినిమా అంతా చూసొచ్చాక మంగపతిగా శివాజీ పాత్ర వెంటాడుతుంది
న్యాయ వ్యవస్థ గురించి, అందులోని లొసుగుల్ని గురించి, వాటితో సామాన్యుడు పడుతున్న ఇబ్బందుల గురించీ కొన్ని కథలు విన్నాం. 'కోర్ట్' కూడా అలాంటిదే. కాకపోతే.. చాలా విషయాల్లో తన ప్రత్యేకత నిలుపుకొన్న సినిమా ఇదీ.