గత రెండు మాసాలుగా విస్తరిస్తున్న కోవిడ్ -19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జీవనశైలి లయ తప్పి తడబడుతోంది.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో,మొక్కవోని ధైర్యంతో సాయం అందించడానికి “మేము సైతం” అంటూ ముందుకు వచ్చి భూరి విరాళాలు అందించడమే కాకుండా నిత్యావసర వస్తువులు,ఆహారం సేకరించి పంపిణి చేయడానికి చికాగో నగరం లోని తెలుగు సంఘాలు అన్ని ఒక్కటై భారీ సహాయ కార్యక్రమం చేపట్టాయి. స్థానిక చర్చ్ ల్లో , ఫైర్ డిపార్ట్మెంట్స్ లో, దేవస్థానం లో , నగర యూనివర్సిటీ ల్లో తెలుగు విద్యార్థులకు నిత్యావసర వస్తువులను అందచేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ తెలుగు సంఘాల స్వచ్చంధ కార్యకర్తలు పాల్గొని ఆఫ్రికన్ అమెరికన్ షెల్టర్ , వుమెన్ షెల్టర్ , కౌంటీ షెల్టర్ , నార్త్ వుడ్ యూనివర్సిటీ , గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ ల్లో దాదాపు పది వేల డాలర్ల విలువైన నిత్యావసర వస్తువులు ఉచితం గా అందించి వచ్చారు
ఈ బృహత్కార్యం లో పాల్గొన్న తెలుగు సంఘాలు :
TANA(Telugu Association of North America)
ATA(America Telugu Association)
ATA(America Telangana Association)
NATS(North America Telugu Samithi)
NATA(North America Telugu Association)
NRIVA
APTA
Telugu Association Of Greater Chicago
TTA(Tristate telugu Association)
CTA(Chicago Telugu Association)
CAA(Chicago Andhra Association)
IAGC(Indian Association of Greater Chicago)
Manabadi
TDF(Telangana Develpoment Forum )