LIVE: AP Elections Results Live

0

లైవ్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు పేజీ రీఫ్రెష్ చేయండి

[ 07 : 25 PM ] సీఎం ప‌ద‌వికి జ‌గ‌న్ రాజీనామా

గ‌వ‌ర్న‌ర్ కు లేఖ‌ను పంపిన జ‌గ‌న్

నేరుగా గ‌వ‌ర్న‌ర్ క‌లిసి రాజీనామా చేయ‌టం ఆన‌వాయితీ…

కానీ కేసీఆర్ బాట‌లోనే లేఖ‌ను పంపిన జ‌గ‌న్

[ 07 : 04 PM ]జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్

గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ, అహంకారం కాదు

175 సీట్లు గెలిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంత బాధ్యతతో పని చేస్తా

పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించాం

దేశంలో వందకు వంద కొట్టేవాడే జన సైనికుడు

ప్రజలు నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు

ప్రజలు నాకు చాలా బాధ్యత ఇచ్చారు

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటా

ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మాట ఇస్తున్నా

సీపీఎస్ విషయంలో న్యాయం జరిగేలా చూస్తా

డబ్బులు, పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు

వ్యవస్థలో రాజకీయ ప్రమేయం తక్కువగా ఉండేలా చూస్తా

ఈ విజయం జన సైనికులదే కాదు.. 5 కోట్ల మంది ప్రజలది

నా జీవితంలో ఇప్పటివరకు విజయం తెలియదు

తొలి ప్రేమ సినిమాతో తొలిసారి విజయం చూశా

ఏపీకి చీకటి రోజులు ముగిశాయి

కక్ష సాధింపు సమయం కాదిది.. ప్రజల కోసం పని చేసే సమయం

జగన్ వ్యక్తిగతంగా నాకు శత్రువు కాదు

ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం

ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు

[ 06 : 41 PM ]మంగళగిరిలో 91 , 500ఓట్ల మెజార్టీతో నారా లోకేష్ గెలుపు

[ 06 : 38 PM ] 3 లక్షల 91 వేల 655 ఓట్ల మెజారిటీతో మల్కాజిగిరి ఎంపీగా విజయం సాధించిన ఈటల రాజేందర్.

[ 06 : 06 ] ఎన్నికల ఫలితాలపై జగన్ ప్రెస్ మీట్

కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన జగన్

ఏం చేసినా 40శాతం ఓటు బ్యాంక్ ను తగ్గించలేకపోయారు.. ఇక నుంచి మళ్లీ లేస్తాం

ప్రతిపక్షంలో ఉండటం కొత్తకాదు.. పోరాడుతాం.. పోరాడేందుకు సిద్దంగా ఉన్నాం

మహిళా సాధికారిత, సామాజిక న్యాయం అంటే ఇది అనేలా మేలు చేశాం

మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం

ఎవరో మోసం చేశారు… ఎవరో అన్యాయం చేశారు అనొచ్చు కానీ ఆధారాల్లేవు

అరకోటి రైతుల ప్రేమ ఏమైందో తెలియడం లేదు.

మంచి చేసినా ఓటమి పాలయ్యాం

కోటి 5 లక్షల మంది అక్క చెల్లెళ్ళ ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియడం లేదు.

మహిళలకు సంక్షేమ పథకాలు అందించాం.. వారి ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు

ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు

ఎన్ని మంచి పనులు చేసినా ఆ ఆప్యాయత ఏమైందో తెలియడం లేదు

అక్కా, చెల్లెమ్మల ఓట్లు ఏమ్మయ్యాయో తెలియడం లేదు

ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి

ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయం పడ్డాం

[05 : 58 PM] ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ

ఈ ఎన్నికలు వ్యవస్థలపై, నిఘా సంస్థలపై చేసిన యుద్ధంగా భావిస్తున్నాం

ఎన్నికలకు ముందు పార్టీ అకౌంట్లను సీజ్ చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారు.

[05 : 52 PM]ఎన్నికల ఫలితాలపై మల్లిఖార్జున ఖర్గే

ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు

ఈసారి ప్రజలు ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు

నైతికంగా ఇది మోడీకి ఓటమి

ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నాం

మోడీ వర్సెస్ ప్రజలు అన్నట్లుగా ఎన్నికలు జరిగాయి

ఇది మోడీ వ్యతిరేక తీర్పు అని భావిస్తున్నాం

రాహుల్ గాంధీ యాత్రలు పార్టీకి ప్లస్ అయ్యాయి

ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం

[05 : 50 PM] ఏపీ ఎన్నికల్లో బొత్స కుటుంబానికి షాక్

చీపురుపల్లిలో బొత్స ఓటమి

విశాఖలో ఆయన సతీమణి పరాజయం

గజపతి నగరంలో సోదరుడు ఓటమి

[05 : 49 PM] పోటీ చేసిన రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ విజయం

[05 : 46 PM] ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓటమి

[05 : 35 PM] పుంగనూరులో నిలిచిన కౌంటింగ్

నాలుగు ఈవీఎంల సీల్ తీసి ఉండటంపై టీడీపీ అభ్యర్థి రాంచంద్రారెడ్డి అభ్యంతరం

ఈసీ దృష్టికి తీసుకెళ్ళిన రిటర్నింగ్ అధికారి

[05 : 30 PM] వారణాసిలో ప్రధాని మోడీ ఘన విజయం

లక్షా 52వేల ఓట్ల పైచిలుకు ఓట్లతో గెలుపు

[05 : 29 PM] కాసేపట్లో వైఎస్ జగన్ ప్రెస్ మీట్

[05 : 25 PM] కరీంనగర్ లో బండి సంజయ్ ఘన విజయం

సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విక్టరీ

[05 : 25 PM] కర్నూల్ లో టీజీ భరత్ విజయం

[05 : 19 PM]మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకున్న చంద్రబాబు నాయుడు

[05 : 17 PM] నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు విజయం

[05 : 16 PM] 20 ఏళ్ల తర్వాత మాచర్లలో టీడీపీ విజయం

[05 : 14 PM] పాయకరావుపేటలో టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత విజయం

[05 : 11 PM] ఎంపీ గోరంట్ల ఇంటిపై రాళ్ల దాడి

దాడి సమయంలో ఇంట్లో లేని గోరంట్ల

[05 : 09 PM] బుధవారం ఢిల్లీలో ఎన్డీయే పక్షాల సమావేశం..?

రేపు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

[05 : 01 PM] నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ పరాజయం

[05 : 00 PM] చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు గెలుపు

[04 : 59 PM] మాచర్లలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి విజయం

[04 : 57 PM]ఆళగడ్డలో భూమా అఖిలప్రియ విజయం..11 వేల ఓట్లతో గెలుపు

[04 : 56 PM] తిరువనంతపురం లోక్ సభ స్థానంలో కేంద్రమంత్రి రాజీవ్ ఓటమి

15వేల ఓట్ల తేడాతో శశిథరూర్ విజయం

[04 : 54 PM] చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

[04 : 52 PM]హైదరాబాద్ ఎంపీగా గెలుపొందిన అసదుద్దీన్ ఒవైసీ

వరుసగా ఐదోసారి గెలిచిన అసద్

[04 : 50 PM] అయోధ్యలో బీజేపీ అభ్యర్థి వెనుకంజ

[04 : 49PM] కాసేపట్లో మీడియా ముందుకు చంద్రబాబు

[04 : 49PM]తూర్పుగోదారి జిల్లాలో 19స్థానాలకు 19 స్థానాలను కైవసం చేసుకున్న కూటమి

[04 : 47 PM] జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ విజయం

[04 : 44 PM] డోన్, ఆళగడ్డ, నంద్యాలలో టీడీపీ అభ్యర్థుల ఘన విజయం

[04 : 42 PM] జమ్మలమడుగులో కూటమి అభ్యర్థి విజయం..17వేల ఓట్ల మెజార్టీతో ఆదినారాయణ రెడ్డి గెలుపు

[04 : 39 PM] బందర్ లో పేరని నాని కొడుకు పేర్ని కిట్టూ ఓటమి

[04 : 37 PM]మంత్రాలయం వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి గెలుపు

[04 : 34 PM] మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ విజయం

[04 : 33 PM] గుంటూరు వెస్ట్ లో టీడీపీ అభ్యర్థి విజయం

సత్తెనపల్లిలో కన్నా లక్ష్మినారాయణ గెలుపు

[04 : 31 PM]కమలాపురంలో టీడీపీ అభ్యర్థి చైతన్య విజయం

[04 : 30 PM]గుంటూరు ఈస్ట్ లో టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ విజయం

[04 : 28 PM] శ్రీశైలంలో టీడీపీ అభ్యర్థి గెలుపు

[04 : 26 PM] నంద్యాలలో టీడీపీ అభ్యర్థి విజయం

[04 : 23 PM] శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకు 10 స్థానాల్లో కూటమి విజయం

విజయనగరం జిల్లాలో 9స్థానాలకు 9స్థానాల్లో కూటమి గెలుపు

అనంతపురం జిల్లాలో 14స్థానాలకు 14స్థానాల్లో కూటమి విజయం

చిత్తూర్ జిల్లాలో 14స్థానాలకు 12సీట్లలో కూటమి..2చోట్ల వైసీపీ విజయం

విశాఖ జిల్లాలో 15 స్థానాలకు 13 స్థానాల్లో కూటమి విజయం

కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు 16 గెలిచిన టీడీపీ కూటమి

గుంటూరు జిల్లాలో 17స్థానాల్లో 17 సీట్లు కూటమి ఖాతాలోనే

[04 : 20 PM] జగన్ సొంత జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్

కడప జిల్లాలో 7 కూటమి … వైసీపీ 3 స్థానాల్లో గెలుపు

[04 : 19 PM] కడప అసెంబ్లీ : టీడీపీ అభ్యర్థి విజయం

12వేల ఓట్లతో ఫరూఖ్ గెలుపు

[04 : 17 PM] తూర్పుగోదావరి జిల్లాలో స్వీప్ చేసిన కూటమి

[04 : 16 PM] వేమూరులో టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు విజయం

[04 : 14 PM]బద్వేల్ లో వైసీపీ విజయం

[04 : 13 PM] ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి సత్యప్రభ విజయం

[04 : 11 PM]కైకలూరులో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ గెలుపు

[04 : 11 PM] మెదక్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం

[04 : 10 PM] చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం

[04 : 09 PM]మహబూబ్ నగర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపు

[04 : 07 PM] నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం

[03 : 56 PM]వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం

2.17లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపు

[03 : 54 PM] ఏపీలో ఏడు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్

కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, తూ.గో, ప.గో…

[03 : 53 PM]కమలాపురంలో టీడీపీ అభ్యర్థి గెలుపు

పాయకరావుపేటలో టీడీపీ అభ్యర్థి గెలుపు

తునిలో యనమల కూతురు దివ్య గెలుపు

[03 : 51 PM]పోటీ చేసిన 21అసెంబ్లీ స్థానాల్లో గెలుపు దిశగా జనసేన

[03 : 49 PM]అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓటమి

[03 : 49 PM] పులివెందుల, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, బద్వేల్, రాజంపేట, రాయచోటి, పుంగనూరు, మంత్రాలయం, ఆలూరు, అరకు, పాడేరు, సత్యవేడు నియోజకవ్ర్గాల్లోనే వైసీపీ ఆధిక్యం

[03 : 45 PM] ఉత్కంఠ రేపుతోన్న మహబూబ్ నగర్ ఫలితం

అన్ని రౌండ్లు ముగిసేసరికి 1800ఓట్ల ఆధిక్యంలో డీకే అరుణ

పోస్టల్ బ్యాలెట్ తో తేలనున్న పాలమూరు ఫలితం

[03 : 44 PM] సాయంత్రం 5.30గంట‌ల‌కు మీడియా ముందుకు రాహుల్ గాంధీ

కేంద్రంలో ఏ పార్టీకి రాని మెజారిటీ

బీజేపీకి మిత్ర‌ప‌క్షాల‌న్నీ స‌హ‌క‌రిస్తేనే మూడోసారి అధికారం

[03 : 43 PM] తొలిసారి కృష్ణా, గుంటూర్ జిల్లాలను స్వీప్ చేసిన టీడీపీ

[03 : 42 PM] పులివెందులలో వైఎస్ జగన్ విజయం ..

[03 : 40 PM] ఆదిలాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి విజయం

[03 : 37 PM]చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం

[03 : 35 PM]పెద్దాపురంలో నిమ్మకాయల చిన్నరాజప్ప గెలుపు

[03 : 34 PM] కుప్పంలో టీడీపీ – వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

[03 : 09 PM]జాతీయ స్థాయిలో 296 సీట్లలో ఎన్డీయే కూటమి, 229సీట్లలో ఇండియా కూటమి ఆధిక్యం

[03 : 07 PM] నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ గెలుపు.. లక్షా 20 వేల ఓట్ల మెజార్టీతో విజయం

[03 : 06 PM] చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడు ఓటమి

[03 : 05 PM]పెద్దిరెడ్డి మినహా మంత్రులంతా ఓటమి

[03 : 04 PM] నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలుపు

[03 : 03 ] నల్గొండలో కాంగ్రెస్ రికార్డ్ విజయం…5 , 52 , 659 ఓట్ల మెజార్టీతో ఘన విజయం

[03 : 01 ] తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్ రెడ్డి ఓటమి

[ 02 : 59 PM ] మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపు

[ 02 : 58 PM ] వైసీపీలో జగన్ మార్చిన నియోజకవర్గాల అభ్యర్థులంతా ఓటమి

[ 02 : 57 PM ]రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత విజయం

మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విజయం

బాపట్లలో టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ గెలుపు

[ 02 : 54 PM ] తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయం

[ 02 : 52 PM ]పెనుగొండలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ గెలుపు

[ 02 : 48 PM ]నల్లగొండ లోక్ సభ 23వ రౌండ్ ముగిసే సరికి

కాంగ్రెస్ అధిక్యం : 551168

కాంగ్రెస్ : 770512

బీజేపీ : 219344

బిఆరెస్ : 216050

[ 02 : 46 PM ]మంగళగిరిలో 41వేల ఓట్ల మెజార్టీతో లోకేష్ ఘన విజయం

[ 02 : 43 PM ] డోన్ లో ఓటమి పాలైన మంత్రి బుగ్గన..

[ 02 : 42 PM ]బాపట్లలో టీడీపీ అభ్యర్థి గెలుపు

[ 02 : 35 PM ] పిఠాపురంలో 70వేల 354 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఘన విజయం

[ 02 : 35 PM ] గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు గెలుపు

[ 02 : 33 PM ] నరసాపురం జనసేన అభ్యర్థి నాయకర్ విజయం

[ 02 : 33 PM ]తణుకు టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాదాకిష్ణ విజయం

[ 02 : 32 PM ] తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి విజయం

[ 02 : 32 PM ] తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి విజయం

[ 02 : 31 PM ]అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడినా… ఎంపీలుగా గెలిచిన బీజేపీ నేత‌లు

గ‌జ్వేల్, హుజురాబాద్ లో ఓడి, మ‌ల్కాజ్ గిరిలో గెలిచిన ఈట‌ల‌

క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీలో ఓడి, క‌రీంన‌గ‌ర్ ఎంపీగా గెలిచిన బండి సంజ‌య్

కోరుట్ల ఎమ్మెల్యేగా ఓడి, నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్

[ 02 : 30 PM ]తాడికొండలో టీడీపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ విజయం… 40వేల ఓట్ల మెజార్టీతో గెలుపు

[ 02 : 28 PM ]కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం

విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్

[ 02 : 25 PM ]జగన్ కేబినెట్ లో ఆధిక్యంలో ఉన్న ఏకైక మంత్రి పెద్దిరెడ్డి

[ 02 : 24 PM ]ఎన్డీయే క‌న్వీన‌ర్ గా చంద్ర‌బాబు… ?

ఏపీలో ఘ‌న విజ‌యం ప‌ట్ల చంద్ర‌బాబుకు అభినంద‌నలు తెలిపిన మోడీ

అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకు ఎన్డీయే క‌న్వీన‌ర్ ప‌ద‌వి ఆఫ‌ర్ చేసిన మోడీ

[ 02 : 23 PM ]కురుపాం టీడీపీ అభ్యర్థి గెలుపు

ఏలూరు టీడీపీ అభ్యర్థి విజయం

[ 02 : 19 PM ] విశాఖ వెస్ట్ టీడీపీ అభ్యర్థి గణబాబు గెలుపు

[ 02 : 19 PM ]ఉండిలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయం

[ 01 : 49 PM ]ఓటమి దిశగా 20 మంది మంత్రులు

[ 01 : 47 PM ]పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం

[ 01 : 41 PM ]ఐదుసార్లు ఓడి… ఆరోసారి గెలుపు బాటలో సోమిరెడ్డి

[ 01 : 36 PM ] మంగళగిరిలో నారా లోకేష్ గెలుపు

[ 01 : 35 PM ]ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి విజయం

వరదరాజుల రెడ్డి గెలుపు

[ 01 : 30 PM ] రాజానగరంలో బలరామకృష్ణ విజయం

చింతలపూడిలో టీడీపీ అభ్యర్థి రోసన్ కుమార్ గెలుపు

[ 01 : 28 PM ]కేరళలో ఎట్టకేలకు బోణీ కొట్టిన బీజేపీ

[ 01 : 25 PM ]ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపు

[ 01 : 25 PM ] చంద్ర‌బాబుతో ఫోన్ లో మాట్లాడిన మోడీ

బాబును అభినందించిన ప్ర‌ధాని… ఎన్డీయే గెలుపుపై హ‌ర్షం

[ 01 : 24 PM ] కొవ్వూరు టీడీపీ అభ్యర్థి గెలుపు

[ 01 : 24 PM ] భీమవరంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులు విజయం

[ 01 : 22 PM ] చింతలపూడిలో టీడీపీ విజయం

[ 01 : 22 PM ]అనపర్తిలో బీజేపీ అభ్యర్థి గెలుపు..20,567ఓట్లతో నల్లమిల్లి ఘన విజయం

[ 01 : 15 PM ]ఏపీలో 161స్థానాల్లో విజయం దిశగా కూటమి అభ్యర్థులు

[ 01 : 13 PM ]బీహార్ లో 33స్థానాల్లో ఎన్డీయే కూటమి, 05స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం

మహారాష్ట్రలో 27 స్థానాల్లో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి 20 స్థానాల్లో లీడ్

[ 01 : 10 PM ]నిజామాబాద్ లో బీజేపీ అభ్య‌ర్థి అర‌వింద్ గెలుపు

[ 01 : 07 PM ]రాజీనామా చేయ‌బోతున్న జ‌గ‌న్

కాసేప‌ట్లో రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ తో భేటీ!

[ 01 : 05 PM ]వయ్ నాడ్ లో రాహుల్ గాంధీకి భారీ ఆధిక్యం.. 2 లక్షల పైచిలుకు ఓట్ల లీడ్

[ 01 : 03 PM ]రాజస్థాన్ లో బీజేపీ – కాంగ్రెస్ మధ్య హోరాహోరీ

మధ్యప్రదేశ్ లో అన్ని స్థానాల్లో బీజేపీ లీడ్

[ 01 : 00 PM ] కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన ఆదిమూలపు సురేష్

[12 :59 PM ]తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఓటమి

[12 :57 PM ]మహారాష్ట్రలో పని చేయని అమిత్ షా వ్యూహాలు

[12 :56 PM ]తమిళనాడులో , పుదుచ్చేరిలో డీఎంకే హవా

[12 :53 PM ]గాంధీ నగర్ లో 4 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో అమిత్ షా

[12 :51 PM ]వెస్ట్ బెంగాల్ లో 33 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యం

[12 : 44 PM ]రాజమండ్రి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గెలుపు

65, 400ఓట్ల మెజార్టీతో ఘన విజయం

[12 : 43 PM ]టీడీపీ పోటీ చేసిన 144స్థానాల్లో 134 చోట్ల లీడ్

[12 : 39 PM ]కుప్పంలో ఆరో రౌండ్ ముగిసే సరికి 11 వేల ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు

[12 : 38 PM ]జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 20చోట్ల ఆధిక్యం

[12 : 37 PM ]ఏపీలో 21 పార్లమెంట్ స్థానాల్లో కూటమి ఆధిక్యం

[12 : 36 PM ]యూపీలో పని చేయని అయోధ్యమంత్రం

యూపీలో పెరిగిన ఇండియా కూటమి గ్రాఫ్

[12 : 31 PM ]నల్లగొండ లోక్ సభ 12వ రౌండ్ ముగిసే సరికి

కాంగ్రెస్ అధిక్యం : 292707

కాంగ్రెస్ : 437914

బీజేపీ : 145207

బిఆరెస్ : 121541

[12 : 31 PM ] రాత్రికి చంద్రబాబుతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్

[12 : 29 PM ] పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గెలుపు

[12 : 27 PM ] పిఠాపురంలో 53వేల ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్

[12 : 26 PM ] కౌంటింగ్ కేంద్రాల నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న వైసీపీ అభ్యర్థులు

[12 : 25 PM ] లక్షకు పైగా మెజార్టీ వస్తుందనుకున్న జగన్ కు చుక్కెదురు.. 20 వేల ఆధిక్యంలోనే జగన్

[12 : 20 PM ] ఈ నెల 9న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు

అమరావతిలోనే చంద్రబాబు ప్రమాణస్వీకారం

[12 : 17 PM ] 20 సంవ‌త్సరాల త‌ర్వాత దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పనున్న ఏపీ

[12 : 12 PM ]సొంత‌గానే ప్ర‌భుత్వ ఏర్పాటుకు స‌రిప‌డ సీట్లు తెచ్చుకున్న టీడీపీ

అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా టీడీపీ, రెండో అతిపెద్ద పార్టీగా జ‌న‌సేన‌, మూడో పార్టీగా వైసీపీ

ప్ర‌భుత్వంలో చేర‌క‌పోతే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్

[12 : 10 PM ] మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఓటమి

[12 : 09 PM ] మెదక్ లో బీఆర్ఎస్ – బీజేపీ మధ్య పోటాపోటీ

రెండో స్థానంలో కొనసాగుతోన్న బీఆర్ఎస్

[12 : 07 PM ] దారుణ ప‌రాభ‌వం దిశ‌గా వైసీపీ

ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 17 స్థానాల్లోనే లీడింగ్

ఇదే జ‌రిగితే క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి

వైనాట్ 175 నుండి 17కు ప‌డిపోయిన‌ట్లేనా?

[12 : 07 PM ] ఏపీలో మూడో స్థానానికి పడిపోయిన వైసీపీ

[12 : 05 PM ]రాజమండ్రిలో లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో పురంధేశ్వరి

[12 : 03 PM ]అనంతపురం జిల్లాలో రెండు చోట్ల మాత్రమే వైసీపీ ఆధిక్యం

[12 : 02 PM ]కుప్పంలో 9వేల పైచిలుకు ఓట్లతో చంద్రబాబు ఆధిక్యం

[12 : 01 PM ]మంగళగిరిలో 19 వేల ఓట్ల ఆధిక్యంలో నారా లోకేష్

[11 : 59 AM ]పులివెందులలో 21 వేల ఓట్ల ఆధిక్యంలో జగన్ మోహన్ రెడ్డి

[11 : 50 AM ]భువనగిరి పార్లమెంట్ 13వ రౌండ్ ఫలితాలు

87,270 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం.

కాంగ్రెస్…2,50,711
బీజేపీ….1,63,441
బీఆర్ ఎస్… 1,08,2

[11 : 49 AM ]40వేలకు పైగా ఆధిక్యంలో పవన్ కళ్యాణ్

[11 : 46 AM ]స్వల్ప ఆధిక్యంలో పెద్దిరెడ్డి, కాకాణి , ఆముదాలవలసలో తమ్మినేని వెనుకంజ

[11 : 42 AM ] ఏపీలో 25 మంది మంత్రుల్లో 23మంది వెనుకంజ

[11 : 42 AM ]కాకినాడ ఎంపీ : 54 వేల ఓట్ల పైచిలుకు ఓట్లతో జనసేన లీడ్

[11 : 39 AM ] ఏపీలో 160స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులు

[11 : 38 AM ]ఉభయ గోదావరి జిల్లాలో కూటమి హవా

[11 : 36 AM ]ఏపీలో వచ్చేసిన తొలి ఫలితం

రాజమండ్రి రూరల్ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం

50వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం

[11 : 34 AM ] మెద‌క్ లో మ‌రోసారి లీడ్ లోకి ర‌ఘునంద‌న్ రావు

6వేల‌కు పైగా లీడ్ లో బీజేపీ

[11 : 32 AM ] నల్గొండ : నల్గొండ పార్లమెంట్ 14వ రౌండ్ ఫలితాలు…

2,44,952 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.

కాంగ్రెస్ – 3,59,298
బీజేపీ… 1,14,346
బీఆర్ఎస్… 98,295

[11 : 32 AM ]చేవెళ్ల నాలుగో రౌండ్ ముగిసేసరికి

56565 లీడ్ లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి

[11 : 29 AM ]ఎన్డీయే విజయంపై ఎగ్జిట్ పోల్స్ తలకిందులు

[11 : 28 AM ]ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో టీడీపీకి 45.49 శాతం ఓట్లు.. వైసీపీకి 39.96శాతం ఓట్లు

[11 : 26 AM ]దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అనూహ్య విజయాలు

కేరళ, తమిళనాడులో ఇండియా కూటమి ఆధిక్యం

యూపీలో ఎన్డీయే – ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోటీ

[11 : 24 AM ] ఏపీలో 158స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న కూటమి

[11 : 22 AM ]కృష్ణా, తూ.గో, ప.గో జిల్లాలో ఖాతా తెరవని వైసీపీ

[ 11 : 21 AM ]రాయలసీమలో 52స్థానాల్లో 41స్థానాల్లో కూటమి లీడ్.. 11 స్థానాల్లోనే వైసీపీ ఆధిక్యం

[ 11 : 20 AM ]కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులు

[ 11 : 19 AM ]ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో విజయం దిశగా కూటమి అభ్యర్థులు

[ 11 : 18 AM ]ఆరో రౌండ్ పూర్త‌య్యే స‌రికి 76వేలకు పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో బండి సంజ‌య్

[ 11 : 17 AM ]మెదక్ లోక్ సభ
రౌండ్ -10 పూర్తి

కాంగ్రెస్ – 115263

బీజేపీ -124632

బిఆర్ఎస్ -125311

[ 11 : 16 AM ] దాదాపు అన్ని జిల్లాలో క్లీన్ స్వీప్ దిశగా కూటమి

[ 11 : 15 AM ]ఏకపక్షంగా వెలువడుతోన్న ఏపీ ఎన్నికల ఫలితాలు..

[ 11 : 14 AM ]ఇప్పటి వరకు 18స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోన్న వైసీపీ

[ 11 : 13 AM ]రాయలసీమలో ఏమాత్రం ప్రభావం చూపని వైసీపీ..

[ 11 : 11 AM ]మెద‌క్ లో బీఆర్ఎస్- బీజేపీ హోరాహోరీ

రౌండ్ రౌండ్ కు మారుతున్న ఆధిక్య‌త‌

799ఓట్ల‌తో మ‌ళ్లీ ఆధిక్యంలోకి వ‌చ్చిన బీఆర్ఎస్ అభ్య‌ర్థి

[ 11 :09 AM ]క‌డియం కావ్య‌- కాంగ్రెస్-వ‌రంగ‌ల్… 69వేల మెజారిటీ

న‌ల్గొండ‌లో కాంగ్రెస్ కు 2ల‌క్ష‌ల మెజారిటి

[ 11 :08 AM ]మ‌ల్కాజ్ గిరిలో ల‌క్షా 25వేల ఓట్ల మెజారిటీలో ఈట‌ల రాజేంద‌ర్

[ 11 :06 AM ]ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ హోదా ఇప్పుడు అదే న‌డుచుకుంటూ వ‌స్తుంది

అలా ఇస్తేనే చంద్ర‌బాబు బీజేపీకి స‌పోర్ట్ చేస్తారు

— ఇండియా టుడే డిస్క‌ష‌న్ లో అభిప్రాయం

[ 11 :06 AM ]ఓటమి దిశగా తమ్మినేని సీతారాం

[ 11 :05 AM ]మాచర్లలో 13, 639ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి లీడ్

[ 11 :04 AM ]ఏపీలో చరిత్ర తిరగరాస్తోన్న టీడీపీ

[ 11 :03 AM ]రాప్తాడులో 6 వేల పైచిలుకు ఓట్లతో టీడీపీ లీడ్

[ 11 :02 AM ]చంద్రబాబుకు భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనల్ని పర్యవేక్షిస్తోన్న పోలీసులు

[ 11 :00 AM ]తెలంగాణలో కాంగ్రెస్ – బీజేపీ మధ్య హోరాహోటీ

చెరో ఎనిమిది స్థానాల్లో లీడ్ లో కాంగ్రెస్ , బీజేపీ… ఓ స్థానంలో ఎంఐఎం లీడ్

[ 10 : 59 AM ]మెదక్ లో ఆధిక్యంలోకి బీజేపీ

[ 10 : 57 AM ]ఏడవ రౌండ్ కు 76 వేల ఓట్ల లీడ్ లో బిజెపి అభ్యర్థి అరవింద్

[ 10 : 56 AM ] జనసేన పోటీ చేసిన 21స్థానాల్లో 19స్థానాల్లో గెలుపు దిశగా అభ్యర్థులు

[ 10 : 54 AM ] 12వేల ఓట్లు పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో నారా లోకేష్

[ 10 : 53 AM ]తెనాలిలో 18 వేల కోట్ల ఆధిక్యంలో నాదెండ్ల మనోహర్

[ 10 : 52 AM ]గిద్దలూరులో వైసీపీ, అద్దంకి, కందుకూరులో టీడీపీ లీడ్

[ 10 : 50 AM ]వయ్ నాడ్ లో 40 వేల ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ

[ 10 : 49 AM ]ఏపీలో 152స్థానాల్లో గెలుపు దిశగా కూటమి

[ 10 : 48 AM ]ఉదయగిరిలో ఆధిక్యంలోకి వచ్చిన వైసీపీ

[ 10 : 47 AM ]ఏడవ రౌండ్ కు 76 వేల ఓట్ల లీడ్ లో బిజెపి అభ్యర్థి అరవింద్

[ 10 : 45 AM ] తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం, గుంటూరు జిల్లాలో క్లీన్ స్వీప్ దిశగా కూటమి

[ 10 : 43 AM ]తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలో ఖాతా తెరవని వైసీపీ

[ 10 : 41 AM ]హిందూపురంలో 7వేల పైచిలుకు ఓట్లతో బాలకృష్ణ లీడ్

[ 10 : 38 AM ]20లోక్ సభ స్థానాల్లో విజయం దిశగా కూటమి అభ్యర్థులు

[ 10 : 38 AM ]రాయలసీమలో విజయం దిశగా కూటమి అభ్యర్థులు

దక్షిణ కోస్తాలో కూటమి అభ్యర్థుల విజయ డంకా

ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల పూర్తి ఆధిక్యత

[ 10 : 36 AM ]ఏపీలో బాణా సంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు

[ 10 : 35 AM ] అమేథీలో వెనుకంజలో స్మృతి ఇరానీ

[ 10 : 34 AM ] విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో టీడీపీ లీడ్

[ 10 : 32 AM ] నిజామాబాద్ జిల్లా :

5వ రౌండ్ ముగిసే సరికి 38500 వేల ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్..

నిజామాబాద్ పార్లమెంట్ లో అధిక్యంలో దూసుకెళ్తున బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్

ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్ల లో బీజేపీ అధిక్యం,

జగిత్యాల, బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి స్వల్ప ఆధిక్యం.

బీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ డిపాజిట్ గల్లంతు అయ్యే అవకాశం

[ 10 : 31 AM ] సర్వేపల్లిలో మంత్రి కాకాణి వెనుకంజ

[ 10 : 30 AM ]భారీ విజ‌యం దిశ‌గా టీడీపీ కూట‌మి

150 స్థానాల‌కు చేరువ‌గా కూట‌మి అభ్య‌ర్థుల లీడ్

[ 10 : 29 AM ]లోక్ సభ ఎన్నికల ఫలితాలు

ట్రెండ్స్ (541/543)
▪️ఇండియా కూటమి 261
▪️ఎన్డీయే కూటమి 259
▪️ఇతరులు 21

[ 10 : 27 AM ]సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్

త‌న సొంత జిల్లా ఉమ్మ‌డి పాల‌మూరులోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్, నాగ‌ర్ క‌ర్నూల్… ప‌క్క‌నే ఉన్న చేవేళ్ల‌, సిట్టింగ్ సీటు మ‌ల్కాజ్ గిరిలో ఓట‌మి దిశ‌గా కాంగ్రెస్

ఖ‌మ్మం, న‌ల్గొండ‌, భువ‌న‌గిరి, వ‌రంగ‌ల్ లో గెలుపు దిశ‌గా కాంగ్రెస్…

[ 10 : 26 AM ]ఉంగుటూరులో టీడీపీ ఆధిక్యత

[ 10 : 25 AM ]భువనగిరి లోక్ సభ రెండో రౌండ్ ముగిసే సరికి.

కాంగ్రెస్ అధిక్యం : 18275

కాంగ్రెస్ : 60986
బిఆరెస్ : 28980
బీజేపీ : 42691.
సీపీఎం : 5949.
కాంగ్రెస్ అధిక్యం : 18275.

[ 10 : 25 AM ]పోటీ చేసిన రెండు చోట్ల భారీ లీడ్ లో రాహుల్ గాంధీ

[ 10 : 24 AM ]గజపతినగరంలో టీడీపీ ఆధిక్యత

[ 10 : 22 AM ] విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధిక్యం..13వేల ఓట్ల లీడ్

[ 10 : 21 AM ]ఉదయగిరిలో 55 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ

[ 10 : 20 AM ]పిఠాపురంలో 20వేల ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్

[ 10 : 18 AM ]రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి 25వేల పైచిలుకు లీడ్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్

[ 10 : 17 AM ] విజయనగరం జిల్లాలో 7చోట్ల టీడీపీ, ఓ స్థానంలో జనసేన, వైసీపీ ఆధిక్యం

[ 10 : 15 AM ] పోటీ చేసిన 21అసెంబ్లీ స్థానాల్లో జనసేన ఆధిక్యం

[ 10 : 15 AM ]మెదక్ లో బీఆర్ఎస్ ముందంజ…3913 ఓట్ల ఆధిక్యం

[ 10 : 14 AM ] గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యం

[ 10 : 12 AM ][ 10 : 12 AM ]కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ

[ 10 : 11 AM ]తాడిపత్రిలో 99ఓట్లతో టీడీపీ ముందంజ

[ 10 : 10 AM ] పుంగనూరులో 45 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ లీడ్

[ 10 : 10 AM ] విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి లీడ్..8660ఓట్ల ఆధిక్యం

[ 10 : 08 AM ] ఏపీలో భారీ మెజార్టీ దిశగా కూటమి అభ్యర్థులు

[ 10 : 07 AM ]నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూల్ , ఆదిలాబాద్ , మహబూబ్ నగర్ , చేవెళ్లలో బీజేపీ ముందంజ

[ 10 : 06 AM ]తూర్పుగోదావరి జిల్లాలో మంత్రుల వెనుకంజ

విశ్వరూప్ , తానేటి వనిత, చెల్లుబోయిన వేణు వెనుకంజ

[ 10 : 05 AM ] కుప్పంలో 5 వేలు దాటిన చంద్రబాబు ఆధిక్యం

[ 10 : 02 AM ] పిఠాపురంలో 10వేలు దాటిన పవన్ కళ్యాణ్ ఆధిక్యం

విజయం దిశగా జనసేనాని

[ 10 : 02 AM ]చేవెళ్లలో బీజేపీ లీడ్

ఎస్. కోటలో టీడీపీ లీడింగ్

[ 10 : 00 AM ]తాడిప‌త్రిలో టీడీపీకి భారీ ఆధిక్య‌త‌

17500ఓట్ల లీడింగ్ లో జేసీ అస్మిత్ రెడ్డి

[ 9 : 59 AM ]ఆముదాలవలసలో టీడీపీ లీడింగ్

గన్నవరంలో వల్లభనేని వంశీ వెనుకంజ

[ 9 : 57 AM ]వార‌ణాసిలో మ‌ళ్లీ లీడింగ్ లోకి వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ

[ 9 : 57 AM ]అనకాపల్లిలో సీఎం రమేష్ లీడ్

[ 9 : 56 AM ] దెందులూరులో చింతమనేని లీడింగ్

[ 9 : 54 AM ] రేపల్లె,నరసన్నపేటలో టీడీపీ లీడింగ్

[ 9 : 54 AM ]గాజువాకలో 7 వేల ఓట్ల ఆధిక్యంలో టీడీపీ

[ 9 : 53 AM ]మైలవరం మూడో రౌండ్ లోనూ టీడీపీ ముందంజ

[ 9 : 53 AM ]మెద‌క్ లో బీఆర్ఎస్ లీడింగ్

[ 9 : 51 AM ]వారణాసిలో 6 వేల పైచిలుకు ఓట్లతో నరేంద్ర మోడీ వెనుకంజ

[ 9 : 50 AM ]రేపల్లెలో టీడీపీ లీడింగ్

[ 9 : 49 AM ]కర్నూల్ జిల్లాలో 10 స్థానాల్లో టీడీపీ ముందంజ

[ 9 : 44 AM ]మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకంజ

[ 9 : 43 AM ]ఓటమి దిశగా మంత్రులు రోజా, అంబటి రాంబాబు, బుగ్గన, నని, జోగి రమేష్ , చెల్లుబోయిన వేణుతో పాటు మాజీ మంత్రి కొడాలి నాని

[ 9 : 41 AM ]ఏపీలో 108స్థానాల్లో ఎన్డీయే కూటమి లీడింగ్

[ 9 : 40 AM ]గన్నవరంలో వెనకబడిన వల్లభనేని వంశీ

[ 9 : 39 AM ]గుంటూరులో పెమ్మ‌సానికి భారీ లీడింగ్

ఇప్ప‌టికే 25వేలకు పైగా ఓట్ల లీడింగ్

[ 9 : 38 AM ]ఏపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీయే కూటమి

[ 9 : 38 AM ]సత్తెనపల్లెలో మంత్రి అంబటి రాంబాబు వెనుకంజ

[ 9 : 36 AM ]కుప్ప‌కూలిన స్టాక్ మార్కెట్లు

ఇండియా కూట‌మికి భారీ లీడింగ్ తో భారీ న‌ష్టాల్లో మార్కెట్లు

700 పాయింట్ల న‌ష్టంలో నిఫ్టీ

[ 9 : 35 AM ] సెంచ‌రీ మార్క్ దాటిన కూట‌మి…

ప్ర‌తి జిల్లాలోనూ కూట‌మిదే ఆధిక్య‌త‌

రాయ‌ల‌సీమ‌లోనూ వెనుక‌బ‌డ్డ వైసీపీ

[ 9 : 34 AM ]పిఠాపురంలో పవన్ ముందంజ.. 7952 ఓట్ల ఆధిక్యం

[ 9 : 32 AM ]గుర‌జాల‌లో 4472ఓట్ల‌తో య‌ర‌ప‌తినేని లీడింగ్

[ 9 :3 1 AM ]కడప అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి ముందంజ

[ 9 : 30 AM ]ఉరవకొండలో టీడీపీ ముందంజ

[ 9 : 29 AM ] నాగర్ కర్నూల్ లో బీజేపీ లీడింగ్

[ 9 : 28 AM ]తెనాలిలో జనసేన అభ్యర్థి ఆధిక్యం

[ 9 : 26 AM ]రాయలసీమలో చాలా చోట్ల టీడీపీ అభ్యర్థుల ముందంజ

[ 9 : 25 AM ]రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి లీడింగ్

[ 9 : 24 AM ]ఉండిలో 6350 ఓట్ల ఆధిక్యంలో రఘురామ

[ 9 : 23 AM ]ఏపీలో ఎన్డీయే కూటమి 70N స్థానాల్లో ఆధిక్యం

[ 9 : 22 AM ]ఏపీలో వెనుకంజలో మంత్రులు

[ 9 : 20 AM ]జమ్మలమడుగులో బీజేపీ లీడింగ్

[ 9 : 20 AM ]నెల్లిమర్లలో జనసేన ముందంజ

[ 9 : 19 AM ]బద్వేల్ లో వైసీపీ ఆధిక్యత

[ 9 : 19 AM ] విజయవాడ సెంట్రల్ లో టీడీపీ లీడింగ్

[ 9 : 18 AM ]పాలకొల్లులో నిమ్మల రామానాయుడు లీడింగ్

[ 9 : 17 AM ]మచిలీపట్నం, పొన్నూరు, మైదుకూరులో టీడీపీ లీడింగ్

[ 9 : 16 AM ]అవనిగడ్డలో జనసేన ఆధిక్యత

[ 9 : 15 AM ]పులివెందుల‌లో సీఎం జ‌గ‌న్ లీడింగ్

1888ఓట్ల ఆధిక్యంలో జ‌గ‌న్

[ 9 : 15 AM ]శ్రీశైలంలో టీడీపీ ఆధిక్యత

[ 9 : 14 AM ]పులివెందులలో జగన్ ఆధిక్యత

[ 9 : 12 AM ]పెడన, పామర్రులో టీడీపీ ఆధిక్యత

[ 9 : 12 AM ]డోన్ లో బుగ్గన వెనుకంజ

[ 9 : 11 AM ]మెదక్ పార్లమెంట్ మొదటి రౌండ్లో బీజేపీ మాధవనేని రఘునందన్ రావు 800 ఓట్ల తో ఆధిక్యం…

బీజేపీ :-3515
కాంగ్రెస్ :2740
బిఆర్ఎస్ :2425

[ 9 : 10 AM ]చేవెళ్లలో బీజేపీకి భారీ ఆధిక్యత

[ 9 : 09 AM ] మైలవరంలో టీడీపీ ఆధిక్యం

[ 9 : 08 AM ] సంతనూహలపాడులో టీడీపీ ఆధిక్యం

[ 9 : 07 AM ] నెల్లూరులో విజ‌య‌సాయిరెడ్డి వెనుకంజ‌

[ 9 : 07 AM ]గుడివాడలో వెనుకంజలో కొడాలి నాని

[ 9 : 06 AM ]తిరుప‌తి అసెంబ్లీలో జ‌న‌సేన‌కు ఆధిక్య‌త‌

[ 9 : 06 AM ] తిరువూరులో వైసీపీ ఆదిక్యం

[ 9 : 05 AM ]హైద‌రాబాద్ లో బీజేపీ అభ్య‌ర్థి మాద‌వి ల‌త లీడింగ్

[ 9 : 04 AM ] హిందూపురంలో బాలకృష్ణ లీడింగ్

[ 9 : 03 AM ]11వేల ఓట్ల భారీ ఆధిక్యంలో ఈటల రాజేందర్

[ 9 : 02 AM ]కాకినాడ రూరల్ లో జనసేన లీడింగ్

[ 9 : 01 AM ]ఆధిక్యంలో వైసీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి

[ 9 : 00 AM ]ఖ‌మ్మంలో భారీ ఆధిక్యంలో కాంగ్రెస్

కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్య‌ర్థి నామా నాగేశ్వ‌ర్రావు

[ 8 : 59 AM ]భువ‌న‌గిరిలో బీజేపీ లీడింగ్… 117 ఓట్ల‌తో పైచేయి

[ 8 : 58 AM ]గుంటూరులో పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ లీడింగ్

[ 8 : 58 AM ]అన‌కాప‌ల్లిలో ఎంపీ అభ్య‌ర్థి సీఎం ర‌మేష్ లీడింగ్

[ 8 : 57 AM ] మ‌చిలీప‌ట్నంలో టీడీపీ ఆధిక్యం

తిరువూరులో టీడీపీ లీడింగ్

మైదుకూరులో టీడీపీ లీడింగ్

[ 8 : 57 AM ]మచిలీపట్నంలో టీడీపీ లీడింగ్

[ 8 : 55 AM ]అమలాపురం టీడీపీ అభ్య‌ర్థి బ‌త్తుల ముందంజ‌

[ 8 : 55 AM ]మూడో రౌండ్ లోనూ గోరంట్లకే ఆధిక్యం

[ 8 : 54 AM ] మంగళగిరిలో నారా లోకేష్ లీడింగ్

[ 8 : 52 AM ] కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి లీడింగ్… 2274ఓట్లు

[ 8 : 51 AM ]కోవూరు టీడీపీ లీడింగ్

[ 8 : 51 AM చీపురుపల్లిలో బొత్స ఆధిక్యం

[ 8 : 50 AM ]విజ‌య‌వాడ ఎంపీ టీడీపీ అభ్య‌ర్థి కేశినేని చిన్ని లీడింగ్

[ 8 : 49 AM ]జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ లీడింగ్

[ 8 : 48 AM ]చంద్ర‌గిరి అసెంబ్లీలో వైసీపీ లీడింగ్

[ 8 : 47 AM ] వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లీడ్

[ 8 : 46 AM ]సికింద్రాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి లీడింగ్

[ 8 : 44 AM ]నరసరావుపేటలో శ్రీకృష్ణదేవరాయలు లీడింగ్

[ 8 : 43 AM ]రాజమండ్రిలో పురందేశ్వరి లీడింగ్

[ 8 : 42 AM ]మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ఎల్ బి నగర్ అసెంబ్లీ సెగ్మెట్ లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్ల తో ఆధిక్యం

బీజేపీ :-8811

కాంగ్రెస్ :2581

బిఆర్ఎస్ :1418

[ 8 : 42 AM ] పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లీడింగ్

[ 8 : 41 AM ] నంద్యాలలో 113ఓట్లతో టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి లీడ్

[ 8 : 40 AM ] పెద్దపల్లి కాంగ్రెస్ లీడ్

[ 8 : 38AM ] రాజ‌మండ్రి రూర‌ల్- రెండో రౌండ్ లోనూ గోరంట్ల ఆధిక్యం

13 రౌండ్ల‌కు గాను విడుద‌లైన 2 రౌండ్ల‌లో గోరంట్ల‌కే లీడ్

[ 8 : 37AM ] నంద్యాలలో టీడీపీ అభ్యర్థి లీడ్

[8 : 35 AM] పిఠాపురంలో చెల్లని ఓట్లు ఎక్కువ

మహబూబ్ నగర్ మొదటి రౌండ్ లో బీజేపీ లీడ్

మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ ఆధిక్యం

మండపేటలో టీడీపీ లీడ్

కరీంన‌గ‌ర్ లో బండి సంజ‌య్ ఆధిక్యం

ఖమ్మంలో ఆధిక్యంలో కాంగ్రెస్

కుప్పంలో చంద్రబాబు లీడింగ్

వయ్ నాడ్ లో ఆధిక్యంలో కొనసాగుతోన్న రాహుల్ గాంధీ

ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యం

నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ లీడ్

టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి లీడింగ్

లోక్ సభ ట్రెండ్స్ లో ఎన్డీయే కూటమి లీడ్

రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ లీడ్

పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు షురూ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here