స్తుతం త్రివిక్రమ్ సినిమాలో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ మొన్న ఉద్దానం సమస్య విషయం లో స్పందించిన తీరు, ప్రభుత్వాన్ని జనం దగ్గరకి తీసుకొచ్చిన తీరు చాల ప్రత్యేకం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పోరాడుతున్న విధానం జనానికి కూడా నచ్చుతోంది. కానీ పార్ట్ టైం పొలిటీషియన్ లాగా ఆయన సినిమాల్లో ఒక అడుగు ఇటు రాజకీయాల్లో ఒక అడుగూ వేస్తూ ఉండడం ఇబ్బందికరంగా ఉంది చాలా మందికి. ఈ అపవాదు ని తొలగిస్తూ రాబోయే అక్టోబర్ నుంచీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తాను అనీ అప్పటి నుంచీ 2019 ఎన్నికల వరకూ జనం లోనే ఉంటాను అనీ ప్రకటించారు పవన్ కళ్యాణ్. రాజకీయాలకి ఇదే సరైన టైం. సరిగ్గా రెండేళ్ళ కంటే తక్కువ కాలం లో ఎలక్షన్ లు వస్తూ ఉండగా పవన్ సినిమాలకి పరిమితం అవ్వడం మంచి పద్ధతి కాదు.
ఇది అర్ధం చేసుకున్న అతను అక్టోబర్ ముహూర్తం పెట్టడం చాలా పాజిటివ్ పాయింట్. అయితే ఈ విషయం లో చిరంజీవి స్పందన వేరేగా ఉందట. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ని చాలా నిశితంగా పరిశీలించిన చిరంజీవి పవన్ ఇలా ఉద్దానం బాధితుల కోసం కష్టపడడం చూసి సంతోష పడ్డాడట .. అయితే పవన్ ఇక మీదట సినిమాలు చెయ్యడు కేవలం రాజకీయాలకే పరిమితం అవుతాడు అనే వార్తలు సైతం మీడియా లో చూస్తున్న చిరు .. పవన్ కి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు అని విశ్వసనీయ సమాచారం. చాలా కాలం తరవాత అన్నా దమ్ములు ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్న సందర్భం కూడా ఇదే అంటున్నారు. రాజకీయాలలో ఉండు కానీ సినిమాలు పూర్తిగా మానద్దు అంటూ తమ్ముడికి ఒక ఉచిత సలహా పడేసారట చిరు. సినిమాలనీ రాజకీయాలనీ రెండింటినీ పవన్ సమ ఉజ్జీ గా నడిపే స్థైర్యం ఉన్నవాడు అన్ని చిరు ఎప్పుడో నమ్మాడు. ఆ మాటే అప్పుడెప్పుడో సర్దార్ ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పాడు. అదే మాట ని ఈ సారి పవన్ కి ఫోన్ చేసి మరీ చెప్పాడట చిరు. ఒక సలహా మాత్రం గానే కాక ఒక చిన్న సైజు వార్నింగ్ గా కూడా చిరు పవన్ కి తన అనుభవం నుంచి నేర్చుకోవాలని కోరాడట. సినిమాలు పూర్తిగా పక్కకి పెట్టి రాజకీయాలలోనే ఉండడం వలన తాను ఏం కోల్పోయాను అనేది పవన్ కి వివరించాడు చిరు అని భోగట్టా !