వరుణ్‌తేజ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం `గని`. చిత్రీకరణ పూర్తయి త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇదో స్పోర్ట్స్ డ్రామా. వరుణ్ ఇలాంటి కథలో నటించడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో తమన్నా ఓ ప్రత్యేక గీతానికి స్టెప్పులు వేసింది. సునీల్ శెట్టి, ఉపేంద్ర లాంటి సీనియర్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతల మధ్య… మరో స్పెషల్ అట్రాక్షన్ చేరింది.
ఈ సినిమాలో `రోమియో జూలియట్` అనే ఓ పాట ఉంది. ఈనెల 8న ఈ పాటని విడుదల చేస్తున్నారు. ఈ పాటకో ప్రత్యేకత ఉంది. దీన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె పాడారు. శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ డాక్టర్లే. వాళ్లలో ఐశ్వర్య శంకర్‌కి సినీ నేపథ్యం ఉంది. ఆమెనే ఈ పాట పాడారు. శంకర్ కుటుంబంతో.. తమన్‌కి మంచి అనుబంధం ఉంది. శంకర్ ని నటుడిగా పరిచయం చేసింది శంకరే. ఇప్పుడు శంకర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు తమన్. `గని`కి సంగీతం అందించింది కూడా తమనే. ఆ అనుబంధంతోనే ఈ పాటని పాడించాడట. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.