హైదరాబాద్: క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించే భారతదేశానికి చెందిన 19 ఏళ్ళ కుర్రాడు అమెరికాలో బాస్కెట్‌బాల్ క్రీడలో చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక బాస్కెట్‌బాల్ ఈవెంట్ ఎన్బీఏ డ్రాఫ్ట్‌లో స్థానం సంపాదించుకున్నాడు. 7 అడుగుల 2 అంగుళాల పొడుగున్న సత్నామ్ ఇటీవల వివిధ పోటీలలో చూపిన అద్భుత ప్రతిభనుచూసి ఇతనిని ఎన్బీఏ డ్రాఫ్ట్‌లోకి ఎంపిక చేశారు. పంజాబ్‌లోని బల్లో కే అనే గ్రామానికి చెందిన ఒక చిన్న రైతుకుటుంబానికి చెందిన సత్నామ్ 2010లో ఐఎమ్జీ స్పోర్ట్స్ అకాడమీ-రిలయెన్స్వారి స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా అమెరికా వెళ్ళాడు. అతని తండ్రి బల్బీర్ కూడా ఏడడుగుల ఎత్తు ఉంటారు…తల్లి 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉంటుంది. భారత బాస్కెట్ బాల్ క్రీడాకారులకు ఇది స్ఫూర్తి దాయకమవుతుందని భారత బాస్కెట్ బాల్ మాజీ కోచ్ స్కాట్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించారు.