హైదరాబాద్: వచ్చే నెల 10వ తేదీనుంచి జింబాబ్వేలో జరిగే మూడు వన్డలు, రెండు టీ 20 మ్యాచ్లకు టీమిండియా జట్టు ఎంపిక సోమవారం జరగనుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ఢిల్లీలో సమావేశమై జట్టును ఎంపిక చేయనుంది. ఆస్ట్రేలియా ఏ, దక్షిణాఫ్రికా ఏ జట్లపై చెన్నైలో, వయానద్లో జరగబోయే ట్రై సిరీస్లో పాల్గొనే ఇండియా ఏ టీమ్నుకూడా ఈ సమావేశంలోనే ఎంపికే చేయనున్నారు. సమావేశంముగిసిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, సెలక్టర్ల కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ ఎంపిక చేసిన జట్ల వివరాలను మీడియాకు వెల్లడిస్తారు.