తాను సీఎం అయినందుకు.. పార్లమెంట్ లో తనకు పరిచయం ఉన్న సహచర ఎంపీలకు రేవంత్ రెడ్డి ఇటీవల ఓ విందు ఇచ్చారు. ఆ విందులో రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. ఆయనే కాదు వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ఈ విషయం తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి… జగన్ రెడ్డికి ఓ నివేదిక ఇచ్చారు. ఇలా ఎంపీలు అనుమతి తీసుకోకుండా రేవంత్ రెడ్డి విందుకు వెళ్లారని చెప్పారు. దాంతో జగన్ రెడ్డి భగ్గుమన్నారు.
మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలపైనే ఫైరయ్యారు. దీంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారట. అందులో తప్పేముందని వారు అనుకున్నారు. కానీ పర్మి,షన్ తీసుకోకుండా వెళ్లడం తప్పేనని జగన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినా మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డికి తెలంగాణ సీఎంతో సున్నం పెట్టుకునే పరిస్థితి లేదు. వారి .. వారి బంధువుల ఆర్థిక ఆయువుపట్టు హైదరాబాద్ లో ఉంది. రేవంత్ రెడ్డి ఓ పట్టు పట్టారంటే… కూసాలు కదిలిపోతాయి. అవేమీ నిజాయితీ పునాదుల మీద ఏర్పడిన వ్యాపారాలు కాదు. అందుకే .. రేవంత్ రెడ్డికి కోపం రాకుండా వెళ్లి వచ్చారు. ఇక్కడ జగన్ రెడ్డికి కోపం వచ్చింది.
మరీ ఇంత నేరో మైండ్ తో ఆలోచిస్తే… ఉన్న వాళ్లు కూడా దూరమవుతారని.. ఇచ్చే పదవుల కోసం ఎంత కాలం ఆత్మాభిమానం తాకట్టు పెడతారన్న అభిప్రాయాలు వైసీపీలో వినిపిస్తున్నాయి. పక్క వాళ్లతో మాట్లాడకూడదు.. రాజకీయ ప్రత్యర్థులు అయితే వ్యక్తిగత శత్రువులు చేసుకోవాల్సిందే అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని .. ఇదేం పద్దతని వైసీపీలో చర్చ జరుగుతోంది.