జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచేసేదాకా సలహాదారులు నిద్రపోతున్నట్లుగా లేదు. లడ్డూ కల్తీ వ్యవహారాన్ని పూర్తిగా జగన్ రెడ్డికే తోసేసిన సలహాదారులు ఇప్పుడు ఆయన పక్కా క్రిస్టియన్ అని నిరూపించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుత వివాదం కారణంగా అనూహ్యంగా ఆయన తిరుమల టూర్ ఖరారు చేశారు. ఇది తెలియక చేశారో.. తెలిసి చేశారో ఎవరికీ తెలియదు… కానీ ఇప్పుడు ఆయన దర్శనానికి వెళ్లాలంటే ఖచ్చితంగా శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి.
జగన్ రెడ్డి పుట్టుకతో అన్య మతస్తుడు
జగన్ రెడ్డి పుట్టుకతోనే అన్యమతస్తుడు. ఆ విషయం అందరికీ తెలుసు. రికార్డుల్లో ఉన్నాయి. మధ్యలో ఆయన హిందూమతం మారలేదు. రాజకీయాల కోసం కొంత మంది స్వాముల కాళ్ల మీద పడ్డాడు. అంతకు మించి ఆయన చేసిందేమీ లేదు. హిందువుల ఓట్ల కోసమే ఆలయాలకు వెళ్తామని విజయమ్మ చెప్పారు. జగన్ రెడ్డి కూడా అదే పాటిస్తున్నారు. ఆయన హిందువు కాదు.. హిందువు ఆచారాలు పాటించరు. భార్యను తీసుకుని ఏ గుడికీ వెళ్లరు.
రాజకీయం, తప్పని పరిస్థితుల్లో తప్ప భక్తితో శ్రీవారిని ఒక్క సారైనా దర్శించుకున్నారా ?
గతంలోనూ శ్రీవారి దర్శనానికి రాజకీయం కోసం వెళ్లారు. ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లారు కానీ.. ఆయన తనకు శ్రీవారి పై నమ్మకం ఉందని… . భక్తితో ఆయన దర్శనం చేసుకుందామని జీవితంలో ఒక్కటంటే ఒక్క సారి కూడా తిరుపతి వెళ్లలేదు. పుట్టిన రోజు నాడో.. మరో రోజో… శ్రీవారి దర్శనం చేసుకుందామని.. హిందూ నాయకులు అనుకుంటారు. జగన్ ఎప్పుడూ అలా చేయలేదు. ఎందుకంటే ఆయనకు శ్రీవారిపై నమ్మకం లేదు. ఆయన నమ్మకం అంతా ఏసునే.
అన్నీ తెలిసి తిరుమల పర్యటన ఖరారు చేసిన సలహాదారులు
అన్నీ తెలిసి రాజకీయంగా లడ్డూ వివాదాన్ని మరింత పెంచి.. అన్యమతస్తుల మద్దతు పొందాలనుకుంటున్న వైసీపీ సలహాదారులు.. జగన్ తిరుమల పర్యటన ఖరారు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన తప్పు తనపై పడుతోందనే.. పాప ప్రక్షాళన పేరుతో ఆలయానికి వస్తున్నారని.. అక్కడ కావాల్సినంత అపవిత్రం చేస్తారని హిందువులు అనుకుంటారు.
డిక్లరేషన్ తో మరింత గలాటా !
గతంలో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి.. డిక్లరేషన్ అడిగే ధైర్యం అధికారులు చేయలేదు. కానీ ఈ సారి మాత్రం తప్పదు. ఆయనకు దర్శనం టిక్కెట్ ఇచ్చే ముందే డిక్లరేషన్ పై సంతకం అడుగుతారు. డిక్లరేషన్ ఇస్తే సరి.. లేకపోతే ఆయనను పోనివ్వరు. క్రిస్టియన్ ను అని ఒప్పుకోకూడదని ఆయన పంతం. ఎందుకంటే హిందువుల ఓట్లు పోతాయి. ఒప్పుకోకపోతే దర్శనానికి పోనివ్వరు. మొత్తంగా జగన్ రెడ్డి సలహాదారులు నట్టేటముంచుతున్నారు.