దేశంలో ప్రత్యేక నగరాలను నిర్మించాలని ఆరాటపడే ప్రభుత్వాల సంఖ్య పెరిగిపోతోంది. రాజధాని లేని రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అమరావతి అనే ఓ భారీ కల కని దాన్ని నిజం చేసేందుకు పయనం ప్రారంభించిన తర్వాత అనేక రాష్ట్రాలు.. తమ రాష్ట్రంలోనూ ఓ మంచి సిటీ ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాయి. గుజరాత్ లో గిఫ్ట్ సిటీ నిర్మాణం జరుగుతోంది. రేవంత్ అధికారంలోకి వచ్చిన తరవాత ఫోర్త్ సిటీకి ప్లాన్ రెడీ చేశారు. ఇప్పుడు కర్ణాటక ఖిర్ సిటీపేరుతో కొత్త సిటీ నిర్మాణం ప్రారంభిస్తోంది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజకీయంగా సమస్యల్లో ఉన్నా… KHIR పేరుతో కొత్త సిటీని బెంగళూరుకు కాస్త దూరంగా… నిర్మిస్తున్నారు. అటు ఎయిర్ పోర్టు.. ఇటు బెంగళూరుకు సమదూరంలో… దొడ్డబళ్లాపూర్ వద్ద ఖిర్ సిటీని ప్లాన్ చేశారు. KHIR అంటే… నాలెడ్జ్, హెల్త్, ఇన్నోవేషన్, రీసెర్చ్. ఖచ్చితంగా రేవంత్ కూడా ఫోర్త్ సిటీ కోసం ఇవే ప్లాన్లు అనుకున్నారు.గురువారమే శంకుస్థాపన కూడా చేస్తున్నారు. కనీసం నలభై వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కర్ణాటక నమ్మకంతో ఉంది.
సహజంగా దేశంలో అత్యధిక పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా కర్ణాటక ఉంది. అందుకే.. ఖిర్ సిటీపై ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అత్యాధునిక ఆఫీస్..లివింగ్ స్పేస్ ఖిర్ సిటీలో ఉంటుంది. ప్లాన్డ్ గా నిర్మాణం ఉంటుంది. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. బెంగళూరుపై ఒత్తిడి తగ్గించేలా ఉంటుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది.