మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫైనల్‌గా ఫడ్నవీస్ ను ఖరారు చేశారు. బీజేపీ అత్యున్నత నిర్ణయాక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఓబీసీ లేదా మరాఠావర్గంనుంచి సీఎంను ఎంపిక చేయాలని ఆలోచించినా అనేక సమస్యలు వస్తాయని వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాల్సి ఉండటంతో పాటు బలమైన నేతనే సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందని.., ఫడ్నవీస్ పేరునే ఖరారు చేశారు.
సంకీర్ణంలోని మరో రెండు పార్టీలు శివసేన, ఎన్సీపీ చీఫ్‌లకు ఎలాంటి పదవులు ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ .. ముందుగానే డిప్యూటీ సీఎం పదవిపై కర్చీఫ్ వేసుకున్నారు. తనకు డిప్యూటీ సీఎంతోపాటు హోంమంత్రి పదవి కూడా ఇవ్వాలని శివసేన చీఫ్ షిండే డిమాండ్ చేశారు కానీ అలాంటి చాన్స్ లేదని బీజేపీ హైకమాండ్ తేల్చేసిందని అంటున్నారు. కారణం ఏదైనా ఇద్దరు మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వారు కోరిన డిమాండ్లను తీర్చే అవకాశం లేదు.
గురువారం ముంబైలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్డీఏ ముఖ్యమంత్రులంతా హాజరవుతున్నారు. ఏపీసీఎం చంద్రబాబునాయుడు కూడా ముంబై వెళ్తున్నారు. ఇటీవల వచ్చిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో అధికార పార్టీలే గెలిచాయి. జార్ఖండ్ నుంచి కాంగ్రెస్ కూటమి గెలవడంతో మరోసారి హేమంత్ సోరెనే సీఎంగా బాధ్యతలు చేపట్టారు.