తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ పరిస్థితి మరీ దయనీయాంగా మారింది. పథకాల వారీగా లెక్కలేసుకుని, ఓటు బ్యాంకును సృష్టించుకుంటూ వచ్చిన జగన్ కు… తిరుమల ఇష్యూతో ఆ పునాదులు కదులుతున్నాయి. ఫించన్ల ఓటు బ్యాంకు అంతా ఇప్పటికే షిఫ్ట్ అయిపోగా, ఇప్పుడు పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా… రెండ్రోజుల గ్యాప్ తర్వాత ఇచ్చిన పిలుపు పార్టీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే. అతి కూడా ఆత్మరక్షణలో భాగంగానే. అందుకే శనివారం దేవాలయాల సందర్శనకు పిలుపునిచ్చింది వైసీపీ. అంతేకాదు తాను హిందూ వ్యతిరేకి అనే ముద్రపడకుండా… ఎక్కడైతే విమర్శలొచ్చాయో, అదే తిరుమల వెంకన్న ఆలయానికి వస్తున్నా అంటూ జగన్ సందేశం పంపారు.
జగన్ తన మతాన్ని ఇంత వరకు ఎక్కడా చర్చకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ, తొలిసారి తన మతం తన పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చేలా తయారయ్యింది. దీంతో నేను అందరివాడిని అని చెప్పుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. అది కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోవటం కాదు… ఒక రోజు ముందుగానే తిరుమలకు చేరుకోబోతున్నారు.
జగన్ తిరుమలకు వస్తున్నారంటే… రాజకీయంగా హడావిడి పెరుగుతుంది. వైసీపీ క్యాడర్ యాక్టివేట్ అవుతుంది. అదే సమయంలో ఈసారి కూటమి పార్టీలు ప్రతిఘటించే అవకాశం కూడా లేకపోలేదు. అది జరిగితే టీడీపీ కుట్రతోనే తనపై బురదజల్లిందని, తనను రాకుండా అడ్డుకుందని… దేవుడి దర్శనానికి వస్తే మీకేం ఇబ్బంది అని ఎదురుదాడికి వైసీపిక అవకాశం దొరకుతుంది. దానికి తోడు, రెండ్రోజుల పాటు రాజకీయం అంతా తన చుట్టూ తిరుగుతుంది. ఇక, తాను వెంకన్న స్వామిని నమ్ముతున్నాను అనే సంతకం చేయటానికి కూడా జగన్ సిద్ధమయ్యారన్న వార్తలు వస్తున్నాయి. అక్కడి వరకు వస్తే సంతకం చేయటం ద్వారా తనపై పడ్డ ముద్రను తొలగించుకోవచ్చన్న ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.