హైదరాబాద్: భారత మహిళా బాడ్మింటన్ జోడి గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప కెనడా ఓపెన్ వుమన్ డబుల్స్ టైటిల్‌ను చేజిక్కించుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డచ్ జోడి ముస్కెన్స్, సెలెనాలను 21-19, 21-16 స్కోరుతో ఓడించారు. సెమీస్‌లో జ్వాల-అశ్విని జపాన్‌కు చెందిన షిహో, కొహరులను ఓడించారు. జపాన్ జోడి వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 98వ స్థానంలో ఉన్నందున 13వ స్థానంలో ఉన్న జ్వాల-అశ్విని జోడి వారిని సులభంగా ఓడించేశారు. జ్వాల-అశ్విని గతవారం జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నమెంట్లోకూడా సెమీస్ వరకు చేరుకున్నారు.