తిరుమల కొండకు జగన్ కాలినడకన వెళ్తున్నారా…? క్రిస్టియన్ అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్… తిరుమలకు వెళ్లటమే అందరినీ ఆశ్చర్యపర్చగా, ఇప్పుడు కాలినడకన చేరుకుంటారన్న వార్త ఇంకా ఆశ్చర్యపరుస్తుంది.
జగన్ తిరుమల పర్యటనపై స్పందించిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు… అన్యమతస్థుడు తిరుమల కొండపై దేవుడిని దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని, నేను దేవుడిని నమ్ముతున్నాను అని సంతకం చేయాల్సిందేనన్నారు. తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆయన రూల్స్ పాటించాలని కోరారు.
జగన్ తన పాప పరిహారార్థం… లడ్డూ ప్రసాదాన్ని కేవలం వాసన చూసి వదిలేయకుండా, ప్రసాదం స్వీకరించి తినాలని రఘురామ సూచించారు. తన పాప పరిహారార్థం ఆ వేంకటేశ్వరస్వామియే జగన్ ను కొండకు పిలిపించుకుంటున్నట్లు భావిస్తున్నామని, చంద్రబాబు సీఎం అయ్యాక లడ్డూ నాణ్యత ఎంతో మెరుగుపడిందన్నారు రఘురామ.
తిరుమల లడ్డూ ప్రసాదంపై ఎవరూ అపోహలు పడాల్సిన పనిలేదని… హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు.
ఈ శనివారం తిరుమల వెంకన్న దర్శనం కోసం జగన్… ఒకరోజు ముందే అంటే శుక్రవారమే రాబోతున్నారు. అయితే, తాను కాలినడకన తిరుమలకు చేరకుంటారా అన్నది మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.