కాకి పిల్ల కాకికి ముద్దు అవునో కాదో గానీ, పీకలలోతు లవ్వులో ఉన్న వారికి మాత్రం లవర్ విపరీతంగా ముద్దు. తన ప్రియుడు రణబీర్ కపూర్ సత్తా ఉన్నవాడని సర్టిఫికెట్ ఇస్తోంది అందాల నటి కత్రినా కైఫ్.
కత్రినా ముద్దుల ప్రియుడు రణబీర్ సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర డభేల్ మని పేలిపోతున్నాయి. వరుస ఫ్లాప్ లతో కపూర్ కుర్రాడు డీలా పడిపోయాడు. అయితే, అతడికి అభిమానులంటే ఎంతో ప్రేమ అని, వాళ్లు కూడా తనను ప్రేమించాలని కోరుకుంటాని కత్రినా వెనకేసుకు వచ్చింది.
ఈ మధ్య హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోగా కపూర్ కెరీర్ డైలమాలో పడింది. బేషరం, రాయ్, బాంబే వెల్వెట్ సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. ఇది తన లవర్ కు ఎంతో బాధ కలిగించే విషయమని కత్రినా సానుభూతి తెలిపింది.
రణబీర్ టాలెంట్ ఉన్న నటుడు కాబట్టి ఏ క్షణమైనా సత్తాను చాటి మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని గట్టిగా చెప్తోంది. అంతటి కమిటెడ్ నటుడిని నేను జీవితంలో చూడలేదు, కాబట్టి అతడి సత్తా ఏదో ఒక రోజు గ్రాండ్ సక్సెస్ ఇస్తుందని చెప్తోంది. మరో వైపు, రాబోయే సినిమా అయినా అదృష్టాన్ని తీసకురావాలని రణబీర్ కోరుకుంటున్నాడు. జగ్గా జాసూస్ తో అయినా ఫ్లాపుల ట్రెండ్ కు తెరపడి సక్సెస్ బాట పట్టాలని రణబీర్ గంపెడాశతో ఉన్నాడు.
పైగా రియల్ లైఫ్ ప్రేమజంట రణబీర్, కత్రినాలే ఇందులో రొమాన్స్ పండించబోతున్నారు. ఇక టెన్షనేమీ లేకుండా హాయిగా ఆ సినిమా విజయాన్ని ఆస్వాదించేద్దాం అని కత్రినా తన ప్రియుడికి భరోసా కూడా ఇస్తోంది. అన్నట్టు, ఈ సినిమాకు ఇద్దరు నిర్మాతలు. వారిలో ఒకడు రణబీర్ కపూర్. మరి నిర్మాతగా జేబులు నింపుకుంటాడా లేక చెయ్యికాల్చుకుంటాడో చూద్దాం.