తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ఆ పార్టీ యువనేత నారా లోకేష్ సిద్దం అవుతున్నారు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలో కనీసం లక్షమంది కార్యకర్తలతో సమావేశమవ్వాలని ఆయన నిశ్చయించుకొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలని ఈరోజు తిరుపతిలో ప్రారంభిస్తారు. ఆ తరువాత కందుకూరులో పార్టీ కార్యకర్తలకి శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. తరువాత తాడేపల్లిగూడెం, అరుకులో కూడా పర్యటించి శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. త్వరలోనే తెలంగాణాలో కూడా పర్యటించి అక్కడ కూడా పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధానంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం తెలుసుకోవడం, వాటిని మళ్ళీ ప్రజలకు చేరవేయడం నేర్పిస్తారు. ఇందుకోసం కంప్యూటర్, ఇంటర్నెట్, ఫేస్ బుక్, ట్వీటర్ వంటి సామాజిక వెబ్ సైట్స్ వినియోగం తదితర అంశాలపై నిపుణులతో పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇప్పిస్తారు. నేటి నుండి 12నెలల పాటు ఈ శిక్షణా తరగతులు నిరంతరంగా కొనసాగవచ్చును.