పవన్ కల్యాణ్ – రానా కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది మలయాళ `అయ్యప్పయున్ కోషియమ్`కి రీమేక్. కొంతమేర షూటింగ్ జరిగింది. కరోనా సెకండ్ వేవ్ తరవాత మరో దఫా చిత్రీకరణ మొదలైంది. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుంచి కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల తప్పుకున్నారు. కొన్న క్రియేటీవ్ డిఫరెన్సెస్ వల్ల ప్రసాద్ మూరెళ్ల… ఈ టీమ్ నుంచి వైదొలిగారు. ఇప్పుడు రవి.కె.చంద్రన్ ఆ బాధ్యతని నిర్వర్తించబోతున్నారు. కాకపోతే..ప్రసాద్ మూరెళ్ల తీసిన సన్నివేశాల్లో కొన్ని పక్కన పెట్టి, వాటిని మళ్లీ కొత్తగా తీయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రసాద్ సినిమాటోగ్రఫీ నచ్చకే ఆయన్ని పక్కన పెట్టినప్పుడు, ఆయన తీసిన సన్నివేశాల్ని ఎలా.. ఉంచుకుంటారు? పైగా.. ప్రసాద్ మూరెళ్లకీ, దర్శకుడికీ ఒక్క క్షణం కూడా పడలేదని, కొన్ని సన్నివేశాలు చూసిన పవన్ `కథ టెంపో మొత్తం మార్చేశార`ంటూ.. మండిపడ్డారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రసాద్ మూరెళ్ల తెరకెక్కించిన సన్నివేశాల్ని వాడుకుంటే, ప్రసాద్ కి కెమెరామెన్ గా క్రెడిట్ ఇవ్వాల్సివస్తుంది. అందుకే చాలా మట్టుకు రీషూట్ చేయాలని భావిస్తున్నార్ట. దాంతో.. ఈ రీమేక్ కాస్త అలస్యం అవ్వబోతోందని టాక్.