“చంద్రబాబు అరెస్టు” అనే వార్తను వినడానికి గులాబీ శ్రేణులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఫోన్ సంభాషణ ఆధారంగా ఆయన్ని ఏసీబీ అరెస్టు చేస్తుందని తెరాస నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. అది అంత సులభం కాదని వారు అనుకోవడం లేదు.
తెలంగాణ వ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతుంది. బాబు ఎప్పుడు అరెస్టయితడు అని ఒకరినొకరు ప్రశ్నించుకోవడం కనిపిస్తుంది. మన నాయకుడు మామూలోడు గాదు, చంద్రబాబును ఇరికిచ్చిండు అని తెరాస కార్యకర్తలు కేసీఆర్ ను పొగడడటం కూడా కనిపిస్తుంది. ఈ ఇరికించడం వెనుక కేసీఆర్ హస్తం ఉందోలేదో గానీ కార్యకర్తలు మాత్రం ఉందనే అనుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి లాగే చంద్రబాబు కూడా చర్లపల్లి జైలుకు పోయే రోజు దగ్గర్లోనే ఉందని గ్రామాల్లో, పట్టణాల్లో తెరాస శ్రేణులు జోరుగా చర్చించుకుంటున్నాయి. దీనికి వారం పడుతుందని, లేదు ఇంకా ఎక్కువే కావచ్చని అంచనాలు వేస్తున్నారు. వారి అంచనాలు ఎలా ఉన్నా, నిజంగా చంద్రబాబు అరెస్టుకు అవకాశాలున్నాయా లేవా అనేదానిపై రాజకీయ పరిశీలకులూ ఎవరి అభిప్రాయాలు వారు చెప్తున్నారు.
చంద్రబాబు సంభాషణగా చెప్తున్న టేపు ఆధారంగా అయితే అరెస్టుకు తగిన ఆధారాలు లేవని కొందరు పరిశీలకుల వాదన. ఆ సంభాషణలో ఎక్కడా లంచం గురించి ప్రస్తావన లేదు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండనే మాట చంద్రబాబు రక్షాకవచంలా ఉపయోగపడుతుందని కొందరి అభిప్రాయం. బాబును అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి కావాలి. కనీస ప్రైమాఫేసీ లేకుండా గవర్నర్ అనుమతిచ్చే అవకాశం లేదు. ఐసీఎప్ అధికారిగా పనిచేసిన నరసింహన్, తగిన ఆధారాలు లేకుండా అనుమతినివ్వడం దుర్లభం.
ఒక రాష్ట్ర ఏసీబీ మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం కాదు గానీ, కనీసం ఇంటరాగేట్ చేయాలన్నా అంత సులభంగా అనుమతి దొరకడం కష్టం. జరిగిన వ్యవహారమంతా రాజకీయ కుట్రలా కనిపించడమే దీనికి కారణం. పైగా బాబు టేపును మొదట ప్రసారం చేసిన టి న్యూస్ యజమాని స్వయంగా కేసీఆరే. ఆ తర్వాత, సాక్షి చానల్ లో ప్రసారమైంది.
ఇది కుట్ర అని టీడీపీ గగ్గోలు పెట్టడానికి ఈ పాయింటు చాలు. మొత్తం వ్యవహారంలో నైతిక విలువలు పక్కకు పోయాయి. రాజకీయ ఎత్తులు జిత్తులే ముఖ్యమైనాయి. రచ్చబండ దగ్గర కూర్చొని బాబు అరెస్టు గురించి మాట్లాడినంత చిన్న విషయం కాదిది. కేసీఆర్ ఎంత ప్రయత్నించినా, ఆయన శిష్య బృందం ఎంత బలంగా కోరుకున్నా… ఏపీ ముఖ్యమంత్రి అరెస్టు అనేది దాదాపు అసాధ్యం అని రాజకీయ పరిశీలకులు, కొందరు న్యాయ నిపుణులు అంచనా వేస్తుం