వెనక్కిరావడమెలాగో తెలియని మొండివ్యూహంతో సోనియా, మెజారిటీయే సమస్యని పరిష్కరిష్కరిస్తుందన్న అహంభావంతో నరేంద్రమోదీ భంగపడిన సభాపర్వమిది.
ఎందుకైనాగాని పార్లమెంటుని స్తంభింపజేసే పోరాటానికి కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే, గులాం నబీఆజాద్ వంటి సీనియర్ నేతలు సముఖంగా లేరని గ్రహించిన సోనియా పోరాటానికి స్వయంగా కొంగుబిగించారు. రాహుల్ అదేస్ధాయిలో రెచ్చిపోయారు. పార్టీని ఎన్నడూలేనంత పాతాళానికి తీసుకుపోయాక కూడా తల్లీకొడుకులకు అంతర్గత ప్రజాస్వామ్యం అవసరం గురించి ఏమీ అర్ధంకాలేదని స్పష్టమైంది.
ఏ సమస్యలూ లేకుండా మోదీ ఐదేళ్ల పాలన సాగితే… మరో ఐదేళ్లు ఆయనే అధికారంలో ఉంటారనీ, తమ రాజకీయాలకు తెరపడుతుందనీ సోనియా భావన. పార్లమెంటును స్తంభింపజేస్తే బీజేపీకి సుష్మాను తొలగించక తప్పదు. దీంతో సుష్మా, మోదీ వ్యతిరేక అసమ్మతిని రాజేస్తారని సోనియా అంచనాఅని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అదేదీ జరగలేదు. పార్లమెంటు ప్రతి ష్టంభన ద్వారా కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదు.
లోక్‌సభలో మెజారిటీని వున్న మోదీ ప్రభుత్వానిక సభ్యులనుంచి ఎలాగూ మద్దతు వుటుందికనుక గట్టెక్కుతామని భావించారు అధికార పార్టీ, ప్రతిపక్షాన్ని గౌరవించి, వారి మద్దతును కూడగట్టుకోవాల్సి వున్న రాజనీతిని ఆయన మరచేపోయారు. సైతం ప్రతిపక్షాలతో రాజీకి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. బీజేపీ మంత్రులు రాహుల్‌ను, కాంగ్రెస్‌ను అతిగా హేళన చేశారు. మోదీ మంత్రివర్గం లోన ఆరుగురు సీనియర్ మంత్రులు మినహా మిగిలినవారందరూ అనుభవం, నైపుణ్యం లేనివారు. ఈపరిస్ధితిని చక్కదిద్దుకోకపోతే మెల్లగా మోదీ ప్రతిష్ట దిగజారిపోతుంది. కాంగ్రెస్‌లాగా బీజేపీ కూడా మిత్రులను మరచిపోవడమే కాదు, శత్రువులను తయారు చేసుకోవడంలో ఆరితేరింది. కాంగ్రెస్‌లాగే బీజేపీ కూడా అహంభావం, వివేకంలేకపోవడం వల్ల విఫలమౌతోంది. 2004-14 మధ్య బీజేపీ ఏవిధంగా పార్లమెంటును స్తంభింపజేసిందో కాంగ్రెస్ కూడా అదే బాటలో దేశానికి చెడు చేసింది.
బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఒకేసారి తిరస్కరించిన డిల్లీ ప్రజల మార్గాన్నే దేశమంతటికీ సూచిస్తున్నతీరులో పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ముగిశాయి.