అఖిల్ ఫ్లాపుల్లో ఉన్నాడు. అఖిల్, హలో… రెండూ దారుణంగా నిరాశ పరిచాయి. ఓ హిట్టు కొట్టకపోతే.. ఆ ప్రభావం ఆఖిల్ కెరీర్‌పై పడుతుంది. ఇలాంటి దశలో.. అఖిల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే.. మరీ అతి జాగ్రత్తకు పోతున్నాడని టాలీవుడ్ టాక్. ‘మిస్టర్ మజ్ను‘ విషయంలో అఖిల్ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాడని, అఖిల్ ప్రమేయం లేకుండా ఏదీ జరగడం లేదని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. లుక్స్ బయటకు రావడం నుంచి, ట్రైలర్లో ఏమేం అంశాలు ఉండాలన్నంత వరకూ అన్నీ అఖిల్ నిర్ణయాలతోనే సాగుతున్నాయట. తొలి ప్రేమ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరిని అలా ఫ్రీగా వదిలేస్తే.. ఇంకా బాగుంటుంది కదా? అని సన్నిహితులు చెబుతున్నా – అఖిల్ తన పంథా మార్చుకోలేదని చెబుతున్నారు. మరోవైపు.. తనయుల సినిమా అంటే నాగ్ జోక్యం తప్పని సరి. రషెష్ ఎప్పుడో చూసేసిన నాగ్, ఫైనల్ కట్ సమయంలోనూ దగ్గరే ఉన్నాడని, నాగ్ సూచనల్ని వెంకీ తు.చ తప్పకుండా పాటించాడని చెబుతున్నారు. అటు నాగ్, ఇటు అఖిల్ కలిసి.. మొత్తం సినిమాని గ్రిప్‌లోకి తీసేసుకున్నారన్నమాట. మరి… తొలి సినిమాతోనే హిట్టిచ్చిన వెంకీ అట్లూరికి పనిచేసే అవకాశం ఇచ్చారో లేదో అనిపిస్తోందిప్పుడు. ‘శైలజా రెడ్డి అల్లుడు‘ సినిమాకి మారుతికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు నాగ్. దాంతో… ఆ సినిమా బెడసికొట్టింది. ఆ తప్పు ఈసారి జరక్కూడదని నాగ్ ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నాడేమో..??