హైదరాబాద్: సోషల్ మీడియాను ఉపయోగించుకోవటంలో దేశంలో నరేంద్రమోడికి సాటిరాగల నాయకుడెవరూ లేరనే చెప్పాలి. తనపై, తన ప్రభుత్వంపై ముప్పేటదాడి చేస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి పుట్టిన రోజుసందర్భంగా ఇవాళ ఆయనకు సోషల్ మీడియాద్వారా శుభాకాంక్షలు తెలిపి మోడి జనంలో మార్కులు కొట్టేశారు. “కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు దీర్ఘ ఆయురైరోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను” అని మోడి ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ కూడా ట్విట్టర్ద్వారానే మోడి శుభాకాంక్షలకు స్పందించారు. మీ అభినందనలకు కృతజ్ఞతలు అని పోస్ట్ చేశారు.
రాహుల్ చాలా రోజులతర్వాత ఇవాళ తన జన్మదినాన్ని ఢిల్లీలో జరుపుకుంటుండటంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చాయి. తన నివాసంలో 45 కిలోల భారీ కేకును కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సమక్షంలో రాహుల్ కట్ చేశారు. రాహుల్ ఇవాళ 45వ సంవత్సరంలో ప్రవేశించారు.