రామ్చరణ్, శంకర్ ‘గేమ్ ఛేంజర్’ మ్యూజికల్ ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టారు. సెకెండ్ సింగిల్ ‘రా మచ్చా’ను పరిచయం చేస్తూ ‘ది సౌండ్స్ ఆఫ్ గేమ్ ఛేంజర్’ అనే వీడియో రిలీజ్ చేశారు. శంకర్, సంగీత దర్శకుడు తమన్ హీరో ఎంట్రీ సాంగ్ గురించి పలు విశేషాలు పంచుకున్నారు.
ఈ పాటలో 1000 మంది జానపద నృత్యకారులతో కలిసి డ్యాన్స్ చేయబోతున్నారు రామ్ చరణ్. ఇందులో సింగిల్-షాట్ డ్యాన్స్ సీక్వెన్స్ హైలైట్ గా వుంటుంది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ పాటని నకాష్ అజీజ్ పాడారు.
1) గుస్సాడి – ఆదిలాబాద్ 2) చావు – పశ్చిమ బెంగాల్ 3) ఘుమ్రా – ఒరిస్సా 4) గొరవర – కుణిత (కర్ణాటక) 5) కుమ్ముకోయ – శ్రీకాకుళం 6) రణప – ఒరిస్సా, 7) పైకా – జార్ఖండ్, 8) హలక్కీ – వొక్కలిగ – కర్ణాటక, 9) తప్పిట గుళ్లు – విజయనగరం 10) దురువా – ఒరిస్సా ఇలా దేశంలోని పలు జానపద నృత్యల స్పూర్తితో ఈ పాటని కంపోజ్ చేశారు తమన్. రేపు ప్రోమో వస్తోంది. సెప్టెంబర్ 30న పూర్తి పాటని విడుదల చేస్తారు.