రజనీకాంత్ ‘వేట్టయన్’ దసరాకి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ఇది. అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్.. ఇలా భారీ తారాగణం వుంది. ఇప్పటికే రజనీకాంత్, మంజు వారియర్ పై చిత్రీకకరించిన మనసిలాయో సాంగ్ వైరల్ అయ్యింది. ముఖ్యంగా మంజు వారియర్ ప్రజెన్స్, సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది.
ఈ రోజు మేకర్స్ మూవీ నుంచి తెలుగు ప్రివ్యూ వీడియోని రిలీజ్ చేశారు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఇంట్రోతో మొదలైన ఈ వీడియోలో పాయింట్ ని రివిల్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో రజనీకాంత్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా కనిపించారు. ఆయన డ్యూటీలో వున్నప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆయన చేసిన ఎన్కౌంటర్స్ పై అమితాబ్ బచ్చన్ అధికారులతో సమీక్ష నిర్వహించే ఎపిసోడ్ తో ప్రివ్యూ ఓపెన్ అయ్యింది.
‘ఎన్కౌంటర్ పేరుతో ఒక మనిషిని హత్య చేయడం హీరోయిజమా ?అని అమితాబ్ అడిగిన ప్రశ్నకు ‘ఎన్కౌంటర్ అనేది నేరం చేసిన వాళ్ళకి విధించే శిక్ష మాత్రమే కాదు.. ఇక మీద ఇలాంటి నేరం జరగకూడదని తీసుకునే ముందు జాగ్రత్త చర్య’ అని రజనీ కౌంటర్ తో సినిమా పాయింట్ పై ఒక ఐడియా వచ్చింది.
రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ దాదాపు అన్ని ప్రధాన పాత్రలకు ప్రివ్యూలో చోటు దక్కింది. రానా, ఫహాద్ ఫాజిల్ పాత్రలు ఇంటెన్స్ గా కనిపించాయి. రజనీ మార్క్ యాక్షన్ వుంది. అనిరుద్ బీజీఎం కొన్ని చోట్ల జైలర్ ని గుర్తు చేసింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. అక్టోబరు 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.