హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు హైదరాబాద్ వచ్చి టీన్యూస్ ఛానల్‌కు నోటీసులు ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ నీటిపారుదలశాఖమంత్రి హరీష్‌రావు అన్నారు. ఆయన శనివారం తెరాస కార్యాలయంలో ఓటుకు నోటు వ్యవహారంలోని వివిధ కోణాలపై విస్తృతంగా మాట్లాడారు. ఏపీ పోలీసులు హైదరాబాద్వచ్చి నోటీసులు ఇవ్వటంపై కేంద్రం, గవర్నర్ స్పందించాలని కోరుకుంటున్నానని చెప్పారు. టీన్యూస్‌కు నోటీస్ ఇచ్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని అన్నారు. టీడీపీ నేతలు తప్పుని తప్పంటే ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తున్నారని అన్నారు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడింది నిజమో, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజకీయాలకు పట్టిన తుప్పు అన్నారు. నిబంధనలను అతిక్రమించినందునే బాబు ఇంటికి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో మిగిలిన ప్రాంతాలలో ఉన్న తెలుగువారి రక్షణకోసంకూడా ఏపీ పోలీసులను మోహరిస్తారా అని హరీష్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేేేేసులో నిందితుడైన ముత్తయ్యను విజయవాడలో, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విశాఖపట్నంలో దాచారని ఆరోపించారు.