హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు తగ్గాయని ఓ సంస్థ.. పెరిగాయని మరో సంస్థ ఇచ్చిన రిపోర్టు లు వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా మెట్రో సిటీస్‌లో డౌన్ ట్రెండ్ కనిపిస్తోందని ఓవరాల్ గా రియాలిటీ నిపుణులు చెబుతున్న మాట. ఇది నిజం కూడా. దానికి కారణం… ఆర్థిక వ్యవస్థలో కనిపించకుండా చొచ్చుకు వస్తున్న మాంద్యంతో పాటు ఐటీ రంగంలో స్లంప్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా నేల విడిచి సాము చేయడం వంటివి కారణాలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు ఎక్కువ – కానీ తగ్గుతున్న ఒప్పందాలు
జూన్ నెలలో హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు బాగా జరిగాయి. ఇళ్ల రిజిస్ట్రేషన్లలో బాగా వృద్ధి నమోదయిందని నైట్ ఫ్రాంక్ ప్రకటించింది. ఆ తర్వాత నెలల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా తగ్గిపోయాయి. హైదరాబాద్‌లో ఆ తగ్గుదల మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారిక రిజిస్ట్రేషన్ల సంఖ్ ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఎంత మేర తగ్గిందో స్పష్టత వస్తుంది. కానీ ఇది దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్
నేల విడిచి సాము చేస్తున్న రియల్టర్లు
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం… ధరలు. రియల్టర్లు నేల విడిచి సాము చేస్తున్నారు. లగ్జరీ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ. కోటి ఆ పైన ఇళ్లే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. పెద్దగా సౌకర్యాలు లేని అపార్టుమెంట్లు కూడా ఆ ధర వరకూ చెబుతున్నారు. ఈ కారణంగా ఇల్లు కొనాలనుకునేవారు వెనుకడుగు వేస్తున్నారు. నిజానికి మధ్యతరగతి జీవుల ప్రపంచం అయిన హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థలో యాభై లక్షల విలువ చేసే ఇళ్లకే ఎనభై శాతం డిమాండ్ ఉంటుంది. కానీ బిల్డర్లు ఈ సెగ్మెంట్ పై ఎక్కువ ఆసక్తి చూపించకుండా… లగ్జరీ వైపు .. కనీసం రూ. కోటి నుంచి ప్రారంభమయ్యే అపార్టుమెంట్లు, ఇళ్లు నిర్మిస్తున్నారు.
మరో ఐదారు నెలలు వేచి చూడాలన్న భావనలో ఇళ్ల కొనుగోలుదారులు
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్ని సురక్షితంగా భావిస్తారు. అందుకే ఎక్కడ సంపాదించిన స్వదేశంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెడతారు . ఇప్పుడు ఆయా దేశాల్లో స్లంప్ రావడంతో పాటు… వివిధ కారణాలతో ఐదారు నెలలు పెట్టుబడుల ప్రణాళికాల్ని ఆపుకోవడం మంచిదని అనుకోవడం వల్ల ఇన్ ఫ్లో తగ్గుతోంది. అయితే.. ఇదంతా .. ఐదారేళ్ల డ్రీమ్ రన్ తర్వాత సహజమేనని.. ఐదారు నెలల తర్వాత మళ్లీ మామూలు స్థితికి వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే నిజమవుతుంది ఎందుకంటే… రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఇప్పటి వరకూ ఎప్పుడూ లేదు మరి.