నాగచైతన్య – సమంతల పెళ్లి కోసం దాదాపుగా యేడాది నుంచి ఎదురుచూస్తున్నారు తెలుగువాళ్లు. రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు చేసుకొని – టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ అయ్యింది ఈ జంట. పెళ్లిళ్లు అయిపోయాయి… ఇక హనీమూన్ ప్లాన్స్ గురించి చర్చ మొదలైంది. చై – సమంతలు హనీమూన్ ఎక్కడ చేసుకొంటారు? వాళ్ల ప్లాన్స్ ఏంటి?? అనే విషయంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వీటన్నింటికి తెర దించేసింది సమంత. ”ప్రస్తతుం హనీమూన్ ప్లాన్స్ ఏం లేవు. నేనూ – చైతూ ఆ దిశగా ఇంకా ఆలోచించలేదు” అని క్లారిటీ ఇచ్చేసింది. హనీమూన్ కంటే చేయాల్సిన సినిమాలే ముఖ్యం అని తేల్చింది సమంత. ”షూటింగులకు కొన్ని రోజుల నుంచీ దూరంగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు సెట్లోకి వెళ్తామా అంటూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నా. ఆదివారం నుంచి ‘సావిత్రి’ షూటింగ్ లో పాల్గొంటాను. రాబోయే రెండు వారాలు సినిమాలకే“ అని చెప్పేసింది. సో… సమంత – చైల హనీమూన్ ఇప్పట్లో లేనట్టే. సమంత ప్రధాన పాత్ర వహించిన ‘రాజుగారి గది 2’ శుక్రవారమే విడుదలైంది. ఈ చిత్రంలో సమంత పాత్రకు, నటనకు మంచి స్పందన వస్తోంది.