ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్టీలన్నీ ఏకపక్ష మద్దతు ప్రకటించడంతో.. సునాయాసంగా.. లోక్ సభలో గట్టెక్కింది. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు కావడంతో… మూడింట రెండు వందల మెజార్టీ అవసరం. అయితే.. లోక్ సభ దాదాపు ఏకపక్షంగా మద్దతు తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా కేవలం మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. వ్యతిరేకంగా ఓటు వేశారు. లోక్ సభలో పార్టీలేవీ వ్యతిరేకించకపోవడంతో.. రాజ్యసభలోనూ.. మూడింట రెండు వంతల మెజార్టీతో బిల్లు పాస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్యసభలోనూ ఈ బిల్లు పాసయితే… విద్యా, ఉద్యోగ అవకాశాల్లో అగ్రవర్ణాల పేదలకు పదిశాతం రిజర్వేషన్ లభించనుంది.
రాజ్యసభలో బిల్లు ఆమోదానికే.. ఒక రోజు.. రాజ్యసభ సమాయాన్ని పొడిగించారు. రేపు రాజ్యసభలోనూ దీనిపై చర్చ జరిగిన తరవాత ఓటింగ్ జరగనుంది. రాజ్యసభలోనూ… రాజ్యాంగ సవరణ ఓకే అయితే… ఆ తర్వాత అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. షెడ్యూల్ నైన్ లో పెడితే.. న్యాయస్థానాల్లోనూ ఇబ్బంది ఉండదనే అంచనా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కోటా ఇవ్వాలన్న ఉద్దేశంతో… ఒక్క రోజు ముందుగా… కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఇరవై నాలుగు గంటల్లో… పార్లమెంట్ లో పెట్టింది.
అయితే.. దీనిపై.. కొన్ని రాజకీయపార్టీ అయినా వ్యతిరేకత వ్యక్తం చేస్తాయని బీజేపీ ఆశించింది. కానీ ఏ ఒక్క పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అందరూ సానుకూలంగా స్పందించారు. అగ్రవర్ణాల పేదల కోసం.. అని చెప్పడంతో.. ఏ రాజకీయ పార్టీ కూడా.. వ్యతిరేకించే సాహసం చేయలేదు. ఈబీసీ బిల్లు న్యాయ సమీక్షకు రాదని… ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో చెప్పుకొచ్చారు. యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి అనేది.. కేవలం కులం ప్రకారం ఇచ్చే రిజర్వే,న్లకే వర్తిస్తుందని చెప్పుకొచ్చారు.