కుమారుడు అఖిల్ కెరీర్‌ను గాడిలో పెట్టడానికి సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్న నాగార్జునకు ఏపీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందింది. చాలా కాలంగా మూడు షోలు, యాభై శాతం ఆక్యుపెన్సీకే పరిమితమైన షోలను పెంచుకునేందుకు అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే చాన్స్ లభించింది. చాలా రోజుల నుంచి ల్యాబ్‌కే పరిమితమైన సినిమా అన్నీ కలిసి రావడంతో విడుదలకు సిద్ధమయింది. కానీ ఏపీలో కలెక్షన్లు ఎలా ఉంటాయోననే ఆందోళన ఉంది.
ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసు ప్రభుత్వాన్ని పొగుడుతూ వస్తున్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విషయంలో మంచిదేనని ప్రకటిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వంతో జరిపిన చర్చల ప్రక్రియలో కూడా పాలు పంచుకున్నారు. గత ప్రభుత్వంలో నంది అవార్డుల కమిటీకి కులం ఆపాదించి రచ్చ చేయడంలో ఈ బన్నీ వాసు ముందు ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయకుండా తన సినిమాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ప్రయత్నాలకు నాగార్జునపేరు కూడా ఉపయోగపడినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్‌తో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్.. నాగార్జునకు వ్యాపార భాగస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత వరకూ ఎలాంటి మినహాయిపులు ఇవ్వడానికి ఆసక్తి చూపించని ప్రభుత్వం కర్ఫ్యూ పొడిగిస్తూ … ధియేటర్లకు కూడా వంద శాతం ఆక్యుపెన్సీకి ఇవ్వడం కాస్త ఆశ్చర్యకరమేనని చెప్పుకోవచ్చు. అఖిల్ సినిమా టిక్కెట్ రేట్లు పెంచితే చూసేవారు తగ్గిపోతారు.. ఉన్న రేట్లకే గిట్టుబాటయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి .. రేట్లు అనేది సమస్య కాదని భావిస్తున్నారు.