పోలవరం నిర్వాసితుల ఖాతాల్లో ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు జమ చేసింది. పదేళ్ల పాటు జగన్ రెడ్డి రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో జమ చేస్తోంది. 2014-19 మధ్య గిరిజనులు, నిర్వాసితుల ఆశలతో జగన్ రెడ్డి ఓ ఆటాడుకుున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చేదానికంటే పదివేలు ఎక్కువ ఇస్తామని చెప్పేవారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వాళ్ల దగ్గరకు వెళ్లి మన దగ్గర డబ్బులెక్క డ ఉన్నాయి.. డబ్బులు ప్రింట్ కొట్టేది కేంద్రం ..వాళ్లు కొట్టి ఇవ్వడం లేదని సొల్లు వాగారు. అయ్యగారిలో ఇంత టాలెంట్ ఉందని తెలియక గిరిజనులు కూడా ఆశ్చర్యపోయారు.
చివరికి పోలవరం ప్రాజెక్టును భ్రష్టుపట్టించి ఇంటికి పోయారు. ఇప్పుడు మళ్లీ ఏపీ ప్రభుత్వం మారడంతో వారికి మంచి రోజులు వచ్చాయి. నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన పరిహారాన్ని మంజూరు చేయడం ప్రారంభించారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా ధ్వంసం అయిన డయాఫ్రంవాల్ ఇతర పనుల్ని ప్రారంభించబోతున్నారు. అదే సమయంలో నిర్వాసితుల పరిహారం కూడా ఇస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్రం బాధ్యత. అయితే కేంద్రంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని నిధులు ఇప్పించుకోవాల్సిన పనితనం ఏపీ ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబునాయుడు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అందుకే పోలవరం ప్రాజెక్టు మళ్లీ గాడిన పడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోసారి వైసీపీ నేతలు వచ్చి పదివేలు ఎక్కువ ఇస్తాం అంటే.. నమ్మేందుకు వారు ఆసక్తి చూపించరు.