తవ్వే కొద్ది కొత్త విషయాలు, కొత్త సంచలనాలు… ఇదీ శ్రీదేవి మరణం ఇస్తున్న షాక్‌లు. శ్రీదేవిది సహజమరణమా? ఆత్మహత్యా? లేదంటే ఇంకో కోణమేదైనా ఉందా? అనే విషయాలపై దుబాయ్ పోలీసులు లోతుగా పరిశోధిస్తున్న కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. శ్రీదేవిపై ఏకంగా రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ ఉందన్నది తాజా వార్త. స్టార్ డమ్ ఉన్న నటీనటులు, ప్రస్తుతం రేసులో ఉన్న వాళ్లు ఈ స్థాయిలో ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. శ్రీదేవి సినిమాలు బాగా తగ్గించేసింది. ఈమధ్య కాలంలో ఒకట్రెండు సినిమాలు చేసిందంతే. ఆ మాత్రం దానికి రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ ఎలా చేయించుకుంటుంది? అనే దిశగా అనుమానాలు పురి విప్పుతున్నాయి. బోనీకపూర్ ఇంకా దుబాయ్ పోలీసుల కస్టడీలోనే ఉండడం, శ్రీదేవి పార్థీవ దేహాన్ని.. ఇండియా పంపించడానికి దుబాయ్ పోలీసులు అనుమతించకపోవడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. శ్రీదేవి తాలుకూ మెడికల్ రిపోర్టులు, ఆస్తి పాస్తుల వివరాలు దుబాయ్ పోలీసులు సేకరిస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ సంగతి బయటపడిందని తెలుస్తోంది.