తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు తగ్గబోతున్నాయి. ఇప్పటికి కరోనా పాజిటివ్ వచ్చి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పదకొండు మందికి నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇది ఓ మంచి సంకేతమన్నారు. మొత్తంగా తెలంగాణలో 67 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. రెండు, మూడు రోజుల నుంచి రోజుకు పది చొప్పున పాజిటివ్ కేసులు తేలినా.. ఆదివారం ఆ స్థాయిలో వెలుగులోకి రాలేదు. అదే సమయంలో.. పదకొండు మందికి నెగెటివ్ రావడం.. గొప్ప ముందడుగుగా భావిస్తున్నారు. మూడు రోజుల పాటు వారిని అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
దేశంలో అనేక ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స జరుగుతోంది కానీ.. ఒక్క సారే పదకొండు మందికి పాజిటివ్ రాలేదు. తెలంగాణలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు వ్యక్తికి కూడా తెలంగాణ వైద్యులు నయం చేశారు. అతను కూడా డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు.. పాజిటివ్ తేలిన వారందరికీ.. పటిష్టమైన వైద్య సదుపాయులు కల్పిస్తూండటం.. వైద్యులు ఎప్పటికప్పుడు … రోగుల ఆరోగ్య పరిస్థితిని చూసి.. తగిన వైద్య సదుపాయాలు కల్పిస్తూండటంతో.. నెగెటివ్ రిపోర్టులు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
పాజిటివ్ రిపోర్టుల ఉన్న మిగతా.. 66 మంది ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది. ఎవరికీ సీరియస్ గా లేదని.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కరికి మాత్రమే.. వెంటిలేటర్ సపోర్టు ఇచ్చారు. మిగతా వారని పూర్తిగా ఐసోలేషన్ కేంద్రాల్లోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోతే.. తెలంగాణలో చేపట్టిన లాక్ డౌన్ సక్సెస్ అయినట్లే అవుతుంది. అదే సమయంలో ప్రభుత్వం.. కల్పించిన వైద్య సౌకర్యాలు కూడా.. మంచి ఫలితాన్నిచ్చినట్లు అవుతుంది.