తేజ్ సినిమా రూ.120 కోట్లా?

పాన్ ఇండియా మార్కెట్ ఇచ్చిన ధైర్యంతో మీడియం రేంజ్ హీరోల సినిమాల బడ్జెట్ల‌కూ రెక్క‌లొచ్చేశాయి. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ రూ.30, రూ.40 కోట్ల మ‌ధ్య తిరిగిన హీరోలంతా ఇప్పుడు వంద కోట్ల మార్క్ కు చేరుకొంటున్నాయి. తాజాగా సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా బ‌డ్జెట్ కూడా సెంచ‌రీ దాటేసింది.

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా రోహిత్ కె.పి. ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల ఓ సినిమా ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ‘హ‌నుమాన్‌’ ఫేమ్ కె.నిరంజ‌న్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ తో క‌లిసి నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం రూ.120 కోట్ల బ‌డ్జెట్ కేటాయించార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తేజ్ కెరీర్‌లో ఇదే భారీ బ‌డ్జెట్ సినిమా. ‘విరూపాక్ష‌’తో ఇటీవ‌లే ఓ మంచి హిట్ కొట్టాడు తేజ్‌. ఆ న‌మ్మ‌కంతోనే ఈ సినిమాపై భారీగా ఖ‌ర్చు పెట్ట‌డానికి నిర్మాత‌లు సిద్ద‌మైపోయారు. ఈ సినిమా కోసం హైద‌రాబాద్ లో ఏకంగా ఆరేడు సెట్లు తీర్చిదిద్దుతున్నారు. సెట్ల‌కే దాదాపు రూ.20 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చువుతుంద‌ని టాక్‌. ఇందులో ఓ ప‌ల్లెటూరు సెట్ కూడా ఉంది. ఈ చిత్రం కోసం ‘సంబ‌రాల ఏటిగ‌ట్టు’ అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్కెట్ మ‌హాల‌క్ష్మి రివ్యూ: లెక్చ‌ర్లు దంచి కొట్టు గురూ!

'కేరింత' సినిమాతో వెలుగులోకి వచ్చిన నటుడు పార్వతీశం. ఆ తర్వాత తనకు మళ్ళీ చెప్పుకోదగ్గ సినిమా పడలేదు. ఇప్పుడు హీరోగా 'మార్కెట్ మహాలక్ష్మీ'అనే సినిమా చేశాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే అబ్బాయి,...

బీఆర్ఎస్ సోషల్ మీడియా స్క్రిప్టెడ్ నిరుద్యోగ ధర్నా – ప్లాన్ వేరే !

నిరుద్యోగుల ఆందోళన పేరుతో బీఆర్ఎస్ నిర్వహించిన స్క్రిప్టెడ్ ధర్నా అభాసుపాలయింది. నిజంగా నిరుద్యోగులు అయితే ఆందోళన రేంజ్ వేరుగా ఉండేది. అంతా పొలిటికల్ కావడంతో.. బీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు.. .సోషల్ మీడియా...

ఢిల్లీలో కేటీఆర్-హ‌రీష్… బీజేపీతో ములాఖ‌త్ కోస‌మా?

బీఆర్ఎస్ కీల‌క నేత‌లిద్ద‌రూ ఢిల్లీలో ఉన్నారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీష్ రావులు గురువారం సాయంత్ర‌మే ఢిల్లీకి చేరుకున్నారు. శుక్ర‌వారం ఉద‌యం కేటీఆర్, హ‌రీష్ రావులు కవిత‌తో ములాఖ‌త్...

అరెస్ట్ భయంతో వణికిపోతున్న జోగి రమేష్

చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు. తాము పెద్ద రౌడీ పుడింగినని జగన్ దగ్గర సర్టిఫికెట్ కొట్టేసి.. కొడాలి నాని, పేర్ని నాని వంటి వాళ్లను కూడా పక్కకు నెట్టేసి మంత్రి పదవి పొందారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close