అమరావతికి రూ. పదిహేను వేల కోట్ల రుమం పనులు రెండు రోజులలో పూర్తి కానున్నాయి. సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఢిల్లీలో ప్రపంచ బ్యాంక్‌తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకుతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. మంగళ , బుధవారాల్లో రుణంపై సంతకాలు జరుగుతాయి. ఈ నిధులకు ప్రత్యేక ఖాతాలు ఏర్పాటు చేస్తారు. అమరావతి కోసం ఇస్తున్న అప్పులు అమరావతి కోసం ఖర్చు చేసేలా ఆయా బ్యాంకులు ఒప్పందాలు చేసుకున్నాయి.
ఈ నిధులతో అమరావతిలో శరవేగంగా మౌలిక సదుపాయల నిర్మాణం పూర్తి చేస్తారు. రోడ్లు , కాలవలు, వరద నీటి నియంత్రణ కాలువలు, విద్యుదీకరణ ఇలా అన్ని పనులకు వెచ్చిస్తారు. రుణాలపై సంతకాలు పూర్తి అయిన తర్వాత ఆలస్యం లేకుండా టెండర్లను పిలిచే అవకాశం ఉంది. జనవరి నుంచి పూర్తి స్థాయిలో అన్ని విభాగాల్లోనూ పనులు జరగాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోక ముందు రూ. 45 వేల కోట్లతో పనులు జరిగేవి. రాత్రింబవళ్లు జరిగే పనులతో కొన్ని వేల మంది ఉపాధి పొందేవారు.
జగన్ రెడ్డి సీఎం అయ్యాక మొత్తం ఆపేశారు. ఐదేళ్ల పాటు జంగిల్ గా మారింది . ఐదేళ్ల తర్వాత గ్రహణం వీడినట్లయింది. ఇప్పుడు అంతకు ముందు కంటే వేగంగా పనులు జరగనున్నాయి. ప్రైవేటుతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా సమాంతరంగా తమ కార్యాలయాల నిర్మాణం చేపట్టనున్నాయి. దీంతో నాలుగేళ్లలో పాలనా నగరానికి ఓ రూపం వస్తుంది.