టాలీవుడ్ సినిమా బడ్జెట్లకి ఏనాడో రెక్కలొచ్చేశాయ్. రూ.100, రూ.150 కోట్లు అనేవి చాలా చిన్న అంకెలుగా కనిపిస్తున్నాయి. ఎంత పెట్టినా, తిరిగి తెచ్చుకోవచ్చన్న ధీమా.. నిర్మాతల్లో కనిపిస్తోంది. స్టార్ హీరో సినిమా హిట్టేతే అలవోకగా రూ.200 కోట్లు పలుకుతోంది. అలాంటప్పుడు బడ్జెట్ల గురించి ఎవరు బెంగ పెట్టుకుంటారు? తాజాగా ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకీ బడ్జెట్ ఖరారైనట్టు టాక్. ఈసినిమాకి రూ.150 కోట్ల బడ్జెట్ ఖాయం చేశార్ట. పారితోషికాలతో సహా! ఇటీవల `ఆచార్య` కొరటాలని నిరాశ పరిచింది. అయినప్పటికీ.. ఆయనపై ఎవరికీ నమ్మకం సడల్లేదు. పైగా ఎన్టీఆర్‌ది ఎప్పుడో లాక్ అయిపోయిన స్టోరీ. ఆర్.ఆర్.ఆర్తో ఎన్టీఆర్ సత్తా బాలీవుడ్ కి కూడా తెలిసింది. కాబట్టి… రూ.150 కోట్లంటే పెద్ద మేటరేం కాదు. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది. స్క్రీప్టు సిద్ధమైనా.. ఇంకొంచెం వర్క్ చేయాలన్న తపనతో.. కొరటాల కొంత సమయం తీసుకుంటున్నట్టు టాక్. ఎన్టీఆర్ కూడా.. `తొందరేం వద్దు.. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే సినిమాని పట్టాలెక్కిద్దాం` అని కొరటాలకు చెప్పాడట. జూన్‌లో ఈ సినిమా క్లాప్ కొట్టుకునే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి సెట్స్‌పైకి వెళ్లొచ్చు.