టీం ఇండియాలో పేసర్ వరుణ్ ఆరోన్ తన జట్టు సభ్యులకి, కుటుంబ సభ్యులకి కూడా నిన్న ఒక పెద్ద షాక్ ఇచ్చేడు. తన చిన్ననాటి స్నేహితురాలు రాగిణిని నిన్న జెంషెడ్ పూర్ కోర్టు సమక్షంలో వివాహం చేసుకొన్నారు. దాని కోసం వారిరువురూ ఆరు నెలల ముందే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కానీ వారి పెళ్లి జరిగేవరకు ఈ విషయం బయటకి పొక్కనీయకుండా జాగ్రత్తపడ్డారు. బహుశః వారి మతాంతర వివాహానికి వరుణ్ లేదా రాగిణి కుటుంబ పెద్దలు అభ్యంతరం తెలిపిఉండవచ్చును. అందుకే ఈవిధంగా రహస్యంగా పెళ్లి చేసుకోవలసి వచ్చిందేమో. ఎలాగూ కోర్టులో వారి పెళ్లి అయిపోయింది కనుక ఈనెల 4వ తేదీన వారిరువురూ క్రైస్తవ సంప్రదాయ పద్దతిలో మళ్ళీ చర్చిలో వివాహం చేసుకోబోతున్నారు. ఆ కార్యక్రమానికి వారు అందరినీ ఆహ్వానిస్తారేమో?