ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. తన కార్యాలయం నుండే హెలికాఫ్టర్ లో నేరుగా గన్నవరం విమానాశ్రయానికి లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణించగల సౌకర్యం కలిగిన మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించబోతున్నారు. వెలగపూడిలో నిర్మించబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయంలో ‘ఏ బ్లాకు’ లోని ఆయన కార్యాలయంపైనే ఒక హెలీ పాడ్ నిర్మించబడుతుంది. తద్వారా ఆయన గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా తన కార్యాలయం భవనంపైనే హెలికాఫ్టర్ లో దిగి క్రిందన ఉండే తన కార్యాలయంలోకి చేరుకోవచ్చును. తద్వారా ఆయన గన్నవరం విమానాశ్రయానికి వెళ్లినప్పుడు, అక్కడి నుండి వచ్చేటప్పుడు ఆయన కాన్వాయ్ వలన ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటుంది. అలాగే ఈ సౌకర్యం వలన ముఖ్యమంత్రిని కలిసే ప్రముఖులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఆయన కార్యాలయానికే చేరుకోవచ్చును. తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనాన్ని ఫాలోం జీ సంస్థ నిర్మించబోతోంది. ఆ సంస్థే హెలిపాడ్ నిర్మాణం కూడా చేసి ఇస్తుంది.