రోబో 2.ఓ మరో వారం రోజుల్లో తెరపై సందడి చేయబోతోంది. ఈ సినిమాపై ఎన్ని భారీ అంచనాలు ఉన్నాయో, అంతకంటే భారీగా అనుమానాలూ ఉన్నాయి. రూ.600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన చిత్రమిది. ఈ స్థాయిలో రికవరీ ఉంటుందా? ఎంత బాగా ఆడినా అన్ని డబ్బులు సంపాదించుకోగలదా? అనే డౌటు చాలామందిలో ఉంది. ఓ సినిమా హిట్టయితే.. దాని సామర్థ్యం ఎంతో బాహుబలి లాంటి చిత్రాలు నిరూపించాయి. రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజనీ మానియా.. జపాన్ లాంటి దేశాలకూ తాకింది. కాబట్టి.. సినిమా హిట్టయితే.. భారీ స్థాయిలో వసూళ్లు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ రూ.600 కోట్లతో తీసిన సినిమా ఇది. విడుదలకు ముందే.. నిర్మాత దాదాపు 75 శాతం తిరిగి రాబట్టుకోవాలి. సినిమా హిట్టయితే లాభాలు, లేదంటే.. ఆ మేరకు నష్టాలొస్తాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ తప్పకుండా నిర్మాతలకు కావల్సిన భరోసా ఇస్తుంటుంది. `రోబో 2ఓ` విషయానికొస్తే… దాదాపుగా అన్నిచోట్లా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ చాలా ఏరియాల్లో సొంతంగానే విడుదల చేసుకుంటోంది. కాబట్టి ముందుగా బయటపడిపోవడం అనేది ఈ సినిమా విషయంలో జరగడం లేదు. అయితే డిజిటల్ రైట్స్ మాత్రం రోబోకి వరంగా మారింది. శాటిలైట్ హక్కుల రూపంలో రోబోకి రూ.120 కోట్లు దక్కాయని సమాచారం. తెలుగు, తమిళ, హిందీ భాషలు మొత్తం కలిపి.. ఈ రేటుకి అమ్మినట్టు తెలుస్తోంది. డిజిటల్హక్కుల క్రింద మరో రూ.60 కోట్ల వరకూవచ్చాయని తెలుస్తోంది. అంటే.. శాటిలైట్, డిజిటల్ రూపంలో దాదాపు 30 శాతం బడ్జెట్‌ని రికవరీ చేయగలిగిందీ చిత్రం. ఓ విధంగా.. రోబోకి ఇది బోనస్ అనుకోవాలి.