తెలంగాణ రాష్ట్ర సమితి నేటికి ఇరవయ్యో ఏట అడుగుపెట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఆవిర్భవించిన టీఆర్ఎస్.. దాన్ని సాధించింది. ఆ తర్వాత బంగారు తెలంగాణ సాధన కోనం నడుం బిగించింది . ఆ దిశగా జోరుగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక తెలంగాణ వస్తేనే.. ప్రజల బతుకులు బాగుపడతాయన్న లక్ష్యంతో 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్కు అంకురార్పణ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ మార్గనిర్దేశకత్వంలో స్వరాష్ట్రం కోసం రాజకీయ ఉద్యమం ప్రారంభించారు. డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవుల్ని త్యాగం చేశారు. కేసీఆర్ వెంట.. అప్పట్లో చాలా కొద్ది మంది నేతలే ఉన్నారు. అందుకే కేసీఆర్ తాను ఒక్కడినే ఉద్యమాన్ని ప్రారంభించానని.. తర్వాత తెలంగాణ సమాజం మొత్తం తన వెనుక నిలిచిదందని గుర్తు చేసుకుంటూ ఉంటారు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందంటే.. ఫక్కున నవ్విన వాళ్లున్నారు. ఆనాడు కేసీఆర్ ఉద్యమాన్ని ఒంటరిగా ప్రారంభిస్తే.. కళ్లెదురుగానే అవహేళన చేసిన వాళ్లున్నారు. రాజకీయం కోసమే తెలంగాణను వాడుకుంటున్నారని తిట్టిన వాళ్లున్నారు. కానీ.. టీఆర్ఎస్ అధినేత మొక్కవోని లక్ష్యంతో… సింగిల్ పాయింట్ ఎజెండాగా ఉద్యమం చేశారు. అనుకున్నది సాధించారు. ఈ క్రమంలో.. అవహేన చేసిన వాళ్లని.. విమర్శించిన వాళ్లనీ అందర్నీ కలుపుకున్నారు. అనుకున్నది సాధించారు. ఉద్యమ వేడి తగ్గుతుందని అనుకున్నప్పుడల్లా.. పదవులను త్యాగం చేసి… ప్రజలను జాగృతం చేశారు. తన ఆమరణ నిరాహారదీక్షతో చరిత్రను మలుపు తిప్పారు.
దేశంలో ఎన్నో రకాల ఉద్యమాలు నడిచాయి. అందులో తమ కులాలకు రిజర్వేషన్ల దగ్గర నుంచి.. తమ ప్రాంతాలకు రాష్ట్రహోదా ఇవ్వాలనే వరకూ.. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ.. స్వతంత్ర భారతదేశంలో… స్పష్టంగా… సక్సెస్ అయిన ఒకే ఒక్క ఉద్యమం టీఆర్ఎస్ నేతృత్వంలో సాగిన తెలంగాణ ఉద్యమం. పిడికెడు మందితో ప్రారంభించి.. సకలజనులను తనతో కలుపుకుని.. కేసీఆర్ ఈ అనితర సాధ్యమైన ఉద్యమాన్ని నడిపి… అనుకున్నది సాధించారు. రాజకీయ బలం పెద్దగా లేదని… కంగారు పడలేదు. ప్రజాబలమే తన బలంగా మార్చుకుని పోరాడి… నాలుగున్నర కోట్ల మంది ఆశల్ని నెరవేర్చారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ ఏకీకరణ సాధించారు.
తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. కరెంట్ సమస్య తీరిపోయింది. పల్లెల్లో.. సాగునీరు కళకళలాడుతోంది. సాధ్యమా అనుకునేటటువంటి .. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు.. అత్యంత వేగంగా పూర్తయి… తెలంగాణ ప్రజలకు సాగునీటి కష్టాలు లేకుండా చేయబోతున్నాయి. కరోనా కారణంగా… ఇరవయ్యో ఆవిర్భావ వేడకులు పెద్ద ఎత్తున నిర్వహించడం లేదు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. నాడు కేసీఆర్ పార్టీని నడిపిస్తే.. నేడు ఆ బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పురోగమిస్తోంది.