ఎంత దూరం ప్రయాణించాలన్నది నీ పట్టుదల, శ్రమ. కానీ ప్రయాణం ప్రారంభమయ్యేది మాత్రం ఒక్క అడుగుతోనే. ఒక్కో అడుగు వేసే కొద్దీ నిన్ను వెనక్కి లాగడానికి కొన్ని వందల మంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఎవరి ప్రభావానికి లొంగకుండా వేసే ప్రతి అడుగూ విజయానికి దగ్గర చేస్తుంది. నారా లోకేష్ రెండు వందల రోజుల కిందట ప్రారంభించిన యువగళం పాదయాత్ర అలాంటి కాలపరీక్షల్ని ఎదుర్కొని విజయవంతంగా ముందుగా సాగుతోంది.
బ్రేకుల్లేవ్ – డ్రామాల్లేవ్ !
జగన్ రెడ్డి పాదయాత్ర వారానికి ఐదు రోజులు ఉండేది. ఒక రోజు కోర్టుకు మరో రోజు విశ్రాంతికి సరిపోయేది. మధ్యలో కోడికత్తి లాంటి ఘటనలు జరిగినప్పుడు ఏకంగా నెలన్నర రెస్ట్. మధ్యలో కాళ్ల బొబ్బల కథలు … వాటికి వైద్యులు చేస్తున్న ట్రీట్ మెంట్లు కథలు కథలుగా చెప్పుకునేవారు. కానీ నారా లోకేష్ పాదయాత్ర నిజాయితీగా సాగుతోంది. ఆయన పాదయాత్రకు ఎక్కడా బ్రేకుల్లేవు. నడుస్తున్నానను కదా అని కాళ్లకు బొబ్బలని చేతులకు గాయాలని ఆయన డ్రామాలేయడం లేదు. అన్నీ పంటి బిగువునా భరించి ఉత్సాహంగా పాదయాత్ర చేస్తున్నారు
కలుపుకుంటూ .. కలసి పోతూ !
నారా లోకేష్ వయసు నలభై ఏళ్లు .. కానీ ఇంట్లో పాతికేళ్లు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ నలభై ఏళ్లూ ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత పవర్ ఫుల్ పొలిటికల్, సినీ ఫ్యామిలీకి చెందిన వారు. ఆయన చాలా సుకుమారంగా పెరిగి ఉంటారని.. ఆయనతో కలిసేదుకు క్యాడర్ మొదట్లో వెనుకడుగు వేసేది. ఈ ఇబ్బందిని గుర్తించిన లోకేష్… క్యాడర్ తో కలిసిపోయేందుకు ఎంచుకున్న మార్గం అత్యుత్తమ ఫలితాలను ఇచ్చింది. ఇక సామాన్య ప్రజలతో ఆయన వ్యవహరిచే విధానం… మన ఇంట్లో మనిషి అన్న అభిప్రాయాన్ని కల్పించింది కలుపుకుంటూ.. కలసిపోతూ… లోకేష్ పాదయాత్ర చరిత్ర సృష్టించే దిశగా సాగుతోంది.
తప్పుడు ప్రచారాలని ఎదుర్కొంటూ. . కుట్రల్ని చేధిస్తూ !
నారా లోకేష్ రెండు వందల రోజుల్లో కుప్పం నుంచి పోలవరం నియోజకవర్గం వరకూ వచ్చారు. నాలుగు వేల కిలోమీటర్లు నడక ఆయన లక్ష్యం., ఇది చెప్పుకున్నంత ఈజీ కాదు. లోకేష్ విషయంలో అసలు కాదు. ఎందుకంటే ఆయన నడకపై తప్పుడు ప్రచారం చేయడానికి ఏకంగా ఓ బెటాలియన్ నే పెట్టుకున్నారు. అధికార యంత్రాంగం ఆయన టూర్ పై ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తూనే ఉంది. వాటన్నింటినీ చేధిస్తూ…. లోకేష్ అడుగులు వేస్తున్నారు.
సాయం చేస్తూ… భరోసా ఇస్తూ !
నాయనా ఆకలేస్తోంది రా అంటే… మన ప్రభుత్వం రాగానే ఊరూరా ఓల్డేజ్ హోంలు కట్టిస్తాననే నాయకుడు మన కళ్ల ముందుఉన్నారు. ఓ ముద్ద పెట్టడానికి అధికారంలోకి రావాలనే నేత … కానీ లోకేష్… తన చేతిలో పరిష్కారం ఉన్న సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపిస్తున్నారు. సమాజానికి .. ప్రభుత్వం తీర్చాల్సిన సమస్యలకు శిలాఫలకం వేసి.. తన హామీని ప్రతిష్టిస్తున్నారు. ఇలా సాయం చేస్తూ.. భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నారు.
లోకేష్ యువగళం ఇప్పుడు ప్రజాగళం అయింది.. ఇచ్చాపురం చేరే సరికి జన ప్రభంజన గళం అవుతుంది. చరిత్రలో నిలిచిపోతుంది.