ఏడు దశల్లో 17వ లోక్సభ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, 12, 19 తేదీల్లో ఈ ఏడు విడతల ఎన్నికలు జరుగుతాయి. అన్ని దశల తర్వాత మే 23వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఇరవై 16 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. అందులో అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగుతాయి. తొలి విడతలోనే ఎన్నికలు పూర్తి కానున్నాయి. అంటే.. ఎన్నికలు పూర్తయిన 40 రోజుల తర్వాతే ఫలితాలు వెలువడనున్నాయి.
దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8.4 కోట్ల మంది కొత్త ఓటర్లు గత ఎన్నికలతో పోలిస్తే వీరిలో అత్యధికులు 18-19 ఏళ్లలోపు ఉన్న వాళ్లే్. జూన్ 3వ తేదీన 16వ లోక్సభ పదవీ కాలం ముగియనుంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ మేరకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 22.3 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్ యూనిట్లు, 17.3 లక్షల వీవీప్యాట్ యంత్రాలు ఉపయోగిస్తున్నారు.
ఎన్నికల తేదీలన ప్రకటనతో… కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించేవారు., ఓ సారి తెలంగాణలో.. మరోసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగేవి. కనీసం వారం గ్యాప్ ఉండేది. ఈ సారి.. వైసీపీ నేతలు.. హైదరాబాద్ లో ఉండే ఆంధ్ర ఓటర్లు… అందరూ.. రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకున్నారనే ఫిర్యాదు చేయడం.. తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తేవడంతో.. రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని… ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే.. ఎప్పుడూ ఎన్నికలు.. మొదటి విడతలో పెట్టలేదు. కానీ.. ఈ సారి మాత్రం.. .మొదటి విడతలోనే… పెట్టేశారు. దీంతో… నెల రోజుల్లోనే.. ఏపీలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాబోతోంది. ఆ తర్వాత ఫలితాల కోసం మరో నెలన్నర పాటు ఎదురు చూడాల్సి ఉంది.