జూన్ 14, 2020…
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య చేసుకున్న రోజు. దేశ వ్యాప్తంగా షాక్. ఎంతో ప్రతిభావంతుడు, ఇంకెంతో భవిష్యత్తు ఉన్న తార… అర్థాంతరంగా రాలిపోవడం లక్షలాది మంది జీర్ణించుకోలేకపోయారు. ఆ క్షణాన అది ఆత్మ హత్య మాత్రమే. కానీ.. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆ ఆత్మహత్య వెనుక ఇంకెన్నో కోణాలు, విషపు నీడలూ కనిపించాయి.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఈ ఏడాది బాలీవుడ్ కుదిపేసింది. కరోనా కంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం పైనే న్యూస్ ఛానల్స్ ఎక్కువ ఫోకస్ చేశాయి. బహుశా ఈ యేడాది ఇంత ఉదృతంగా చర్చ జరిగిన అంశం మరొకటి లేదేమో…? అంతేకాదు సినీ ప్రపంచంలోని కొన్ని చీకటి కోణాలు టాక్ అఫ్ ది టౌన్ గా మారాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం.. ఆత్మ హత్య, హత్యఅనేది ఇంకా మిస్టరీగానే వుంది. ఈ మిస్టరీని చేధించాల్సిన బాధ్యత సిబిఐ తీసుకుంది. వాళ్ళ విచారణ సాగుతోంది.
ఎవరీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ?
ప్రతి మనిషి ఓ కలతో జీవితం మొదలుపెడతాడు. దాని కోసం పరుగులు. విజయం సాధిస్తే ఆనందం. అపజయం ఎదురైతే నిరాశ. కానీ సుశాంత్ కథ దీనికి భిన్నం. తన కల కోసం పరిగెత్తాడు. విజయం సాధించాడు. అలాంటి ఓ విజేత చాలా దారుణమైన పరిస్థితిలో విగతజీవిగా కనిపించడం అందరినీ కలిచివేసింది. సుశాంత్ సింగ్ నేపధ్యం గురించి చెప్పుకుంటే.. అతడికి, సినిమా ప్రపంచానికి సంబంధం లేదు. మంచి విద్యార్ధి. 11 ఇంజినీరింగ్ ఎంట్రన్స్ లు క్లియర్ చేసిన సత్తా వున్న స్టూడెంట్. ఢిల్లీ యునివర్సిటీలో ఇంజినీరింగు లో చేరాడు. అక్కడ చదువుతూనే ఐఐటీ, జేఈఈ విద్యార్ధులకు ప్రైవేట్ చెబుతూ.. ఆ డబ్బులతో రాయిల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కుని, ఓ ప్లాషియల్ అపార్ట్మెంట్ లో వుంటూ స్టూడెంట్ దశలోనే చాలా లగ్జరీగా లైఫ్ ని డిజైన్ చేసుకున్న వ్యక్తి. సుశాంత్ చనిపోయినపుడు చాలా మంది సెలబ్రీటీలు అతడికున్న నాలెడ్జ్ ని గుర్తు చేసుకొని బాధపడ్డారు. ఖాళీ సమయంలో సినిమా సెట్స్ లో కూడా ఫిజిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెల్జన్సీ గురించి చాలా సులువుగా అర్ధమయ్యేట్లు చెప్పేవాడని కొందరు కో స్టార్స్ గుర్తు చేసుకున్నారు.ఇంత మంచి చదవరి.. తనకు ఏ మాత్రం సంబంధం లేని కలకన్నాడు. నటుడిగా మారాలనుకున్నాడు. ఎంతలా అంటే .. ఇంజనీరింగ్ ని మూడో ఏడాదిలోనే వదిలేశాడు. తప్పులేదు. అతడి కాన్ఫిడెన్స్ లెవల్స్ ఆ రేంజ్ లో ఉండేవి. చూడ్డానికి బావుంటాడు. మంచి కలర్, ఎత్తు, స్వచ్చమైన నవ్వు, సమ్మోహనకరమైన రూపం. అయితే గాడ్ ఫాదర్ లేని ఇండస్ట్రీలో స్థిరపడాలంటే మాటలు కాదు. అక్కడ ఎవరూ తలుపు తెరచి వుంచరు.
ఐశ్వర్యరాయ్ పక్కన సైడ్ డ్యాన్సర్ :
సుశాంత్ కి డ్యాన్స్ అంటే ఇష్టం. మొదట డ్యాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యాడు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ శిమక్ దావర్ నడిపే డ్యాన్స్ స్కూల్ అది. అక్కడే బెర్రీ జాన్ అనే ప్లే డైరెక్టర్ తో పరిచయం ఏర్పడింది. 2006లో తొలిసారి ప్రదర్శన ఇచ్చే అవకాశం వచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకకి ఐశ్వర్యరాయ్ ధూమ్ పాటకి డ్యాన్స్ చేసింది. గ్రూప్ డ్యాన్సర్ లో ఒకడిగా కనిపించాడు సుశాంత్. అదే మొదటి స్టేజ్ షో. తర్వాత బాంబేకి షిఫ్ట్ అయిపోయాడు. చాలా మంది లానే ప్రుధ్వీ థియేటర్ లో పని చేశాడు. అక్కడే బాలాజీ టెలీ ఫిలిమ్స్ వాళ్ళు ఓ సీరియల్ లో సెకెండ్ లీడ్ గా సుశాంత్ ని తీసుకున్నారు. ఆ సీరియల్ చేస్తున్నప్పుడే ఏక్తా కపూర్ ద్రుష్టిలో పడ్డాడు. తర్వాత ‘పవిత్ర రిస్త’ సీరియల్ లో అతడికి మెయిన్ లీడ్ అవకాశం వచ్చింది. ఆ సరియల్ తోనే చాలా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ సీరియల్ లో హీరోయిన్ రోల్ చేసిన అంకితా లోఖండేతో ప్రేమ కూడా మొదలైయింది.
ధోని అంతటి స్టార్ డమ్ :
ఒక పక్క నటిస్తూనే మరో పక్క జరా నాచ్ ఖే దిఖా, జలక్ దిఖహ్లజా లాంటి డ్యాన్స్ షోలతో బిజీ అయ్యాడు. అయితే అతడి మనసు మాత్రం బుల్లి తెరపై కాకుండా వెండితెరపైనే వుండేది. అందుకే ఇవన్నీ పక్కన పెట్టి అమెరికా వెళ్ళిపోయి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ లో జాయిన్ అయిపోయాడు. కోర్స్ పూర్తి చేసి రాజ్ 2 సినిమాకి సహాయ దర్శకుడిగా చేరాడు. అయితే అతడి మనసు నటనపై వుండేది. బాలీవుడ్ లో హీరోగా స్థిరపడాలని తపించేవాడు. ఇదే సమయంలో కైపోచి సినిమాలో అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా త్వరగా విడుదలకు నోచుకోలేదు. ఈ దశలో రాజ్ కుమార్ హిరానీ నుంచి పిలుపోచ్చింది. పీకే లో ఓ మాంచి రోల్ చేశాడు. ఆ సినిమా క్లాసిక్ గా నిలిచింది. వెంటనే యష్ రాజ్ బ్యానర్ ”సుద్ దేశి రొమాన్స్” కి సైన్ చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. చాలా మందికి ఫేవరేట్ హీరో అయ్యాడు సుశాంత్. రాబ్తా, కేదార్ నాద్, డిటేక్టవ్ బొమ్కేష్ లాంటి సినిమాలు సుశాంత్ ఖాతాలో చేరినప్పటికీ .. అతడి తిరుగులేని ఇమజ్ తెచ్చింది మాత్రం ‘ధోని’ బయోపిక్. ధోనికి ప్రింట్ గుద్దినట్లు కనిపించాడు. ఈ దేశంలో ధోని ఎంతమందికి తెలుసో.. సుశాంత్ కూడా అంత మందికి తెలుసు. ఇంత గొప్ప స్టార్ స్టేటస్ సంపాయించిన సుశాంత్.. ఇలా వెళ్ళిపోవడం ఇప్పటికీ షాకింగ్.
డిప్రషన్ కారణమా ?
సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరికైనా చిన్న మెసేజ్ లాంటింది రాసి చనిపోతారు. కానీ సుశాంత్ విషయంలో అలాంటి నోట్ ఏమీ దొరకలేదు. చివరిగా ఓ మిత్రుడితో క్యాజువల్ గానే మాట్లాడాడు. అప్పుడు కూడా భవిష్యత్ లో చేయాలనుకునే సినిమాల ప్రస్తావన తెచ్చాడట. అంతకుముందు రోజు కూడా ఫ్రండ్స్ తో పార్టీ చేసుకున్నాడు. మరుసటి రోజు ఫ్యాన్ కి ఉరి వేసుకొని నిర్జీవంగా కనిపించాడు. అతడి రూమ్ లో కొన్ని మాత్రలు దొరికాయి. అవి డిప్రషన్ కి ఇచ్చే మాత్రలు. పోలీసులు ఆరా తీస్తే సుశాంత్ ఆరు నెలలుగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడని తేలింది. అయితే ఈ డిప్రషన్ ఎందుకు ? బేసిగ్గా డిప్రషన్ కి కారణాలు తెలీవు. కారణం తెలిసిపోతే దాన్ని నుంచి ఈజీగా బయటపడొచ్చని మానసిక వైద్యులు చెబుతారు. సుశాంత్ .. తన అవకాశాలు తగ్గిపోతున్నాయని, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని కారణంతో డిప్రషన్ లోకి వెళ్లిపోయాడని, ఆ డిప్రషన్ తోనే ఇలా వెళ్లిపోయాడని ఓ వింత వాదన వినిపిస్తుంది. ఇందులో కొంత వాస్తవం వుంది కానీ కేవలం ఇదొక్కటే అతడు చనిపోవడానికి కారణం కాదని చాలా మంది మాట.
రియా ఎపిసోడ్:
సుశాంత్ కంటే ఎక్కువ వార్తల్లో నిలిచిన పేరు రియా చక్రవర్తి. సుశాంత్ ప్రేయసి. అంకిత తో విడిపోయిన తర్వాత రియాకి దగ్గర అయ్యాడు సుశాంత్. ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ రియా పట్ల సుశాంత్ మరీ అంత ఇష్టంగా ఉండేవాడు కాదని చాలా మంది సన్నిహితులు వాపోయారు. రియా ప్రవర్తన కూడా విచిత్రంగా వుండేది. ఆమె సుశాంత్ జీవితంలోకి వచ్చిన తర్వాత సుశాంత్ వ్యవహారాల్ని మార్చేసింది. పాత స్టాఫ్ ని తీసేసింది. వాచ్ మ్యాన్ తో సహా అందరినీ తప్పించి, తన వాళ్ళని పెట్టుకుంది. దాని తోడు రియా అంచనాలు కూడా భారీ ఉండేవట. అన్నిటికిమించి రియాకి వున్న ఓ రిలేషన్ సుశాంత్ కి నచ్చేది కాదు.
మూసలోడే కానీ మహానుభావుడు:
మహేష్ భట్.. పరిచయం అక్కర్లేని పేరు. మంచి ఫిల్మ్ మేకర్. అ సంగతి పక్కన పెడితే అతడి ఇంకో స్పెషాలిటీ వుంది. అదేదో సినిమాలో బ్రహ్మానందంలా బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. బ్రేక్ కోసం అతడితో స్నేహం చేసిన తారల లిస్టు పెద్దదే. అతడి సినిమాలానే నిజ జీవితం కూడా చాలా ఎరోటిక్. అతడి ట్రాక్ రికార్డ్ ఏమిటంటే.. పర్వీన్ బాబీ.. నుంచి రియా వరకూ చాలా సంచలనమైన ఎపిసోడ్స్ లో ఆరోపణలు ఎదురుకున్న చరిత్ర సొంతం చేసుకున్నాడు. పర్వీన్ తో పబ్లిక్ గానీ ప్రమాయణం నడిపాడు.అప్పుడు బాలీవుడ్ ఓ వెలుగు వెలుగుతున్న పర్వీన్, మహేష్ ప్రేమలో మినిగింది. అప్పటికే పెళ్లయిన మహేష్,. ఆమె కోసం భార్యని వదిలేయడానికి సిద్ధపడిపోయాడు. కానీ ఇంతలోనే పర్వీన్ కి ఏదో మానసిక సమస్య వచ్చిపడింది. పారానోయిడ్ స్రిజోఫినియా అన్నారు వైద్యులు. కొన్ని కారణాల వల్ల వాళ్ళ మధ్య దూరం పెరిగింది. కొంత కాలం తర్వాత ఆమె చాలా అనుమానస్పద స్థితిలో తన ఇంట్లోనే విఘత జీవిగా కనిపించింది. అదలాముగిసిపోయింది.
జియా ఖాన్ తో లింక్ :
మహేష్ భట్ కాంపౌడ్ నుంచి వచ్చిన మరో సంచలనం జియా ఖాన్. తన మనవరాలి వయసున్న జియా ఖాన్ తో కూడా స్నేహం చేశాడు మహేష్. అప్పట్లో వాళ్ళ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. మసలోడిలో ఇంకా మన్మధలీలలు పోలేదని జనాలు చెవులు కొరుక్కున్నారు. జియాకి ఓ రెండు సినిమాల్లో అవకాశం కూడా ఇచ్చాడు. తర్వాత ఆమె జీవితం కూడా ఏవో కారణాలతో సూసైడ్ గానే ముగిసిపోయింది. జియా చావుకు కారణం సూరజ్ పంచోలి అనే ఆరోపణలు వున్నాయి. అయితే కొంతమంది బిగ్ షాట్స్ ఆ కేసుని కప్పిపెట్టేశారు. అన్నట్టు.. కంగనా కూడా మహేష్ ఫ్రండ్స్ లిస్టు లో వుంది. మొదట బాగానే సాగింది కానీ కంగనాకి ఇమేజ్ వచ్చిన తర్వాత ”మహేష్ ఓ దరిద్రుడు” అని తిట్టిపోసింది.
రియాకి మహేష్ ఇచ్చిన సలహా:
ఇప్పుడు సుశాంత్ కేసులో కూడా మహేష్ భట్ పేరు తెరపైకి వచ్చింది. మహేష్ తో రియాకి చాలా క్లోజ్ రిలేషన్ వుంది. రియా బ్రేక్ కోసం చేసిన ప్రయత్నం ఏమో కానీ వాళ్ళ మధ్య రిలేషన్ వున్న సంగతి మాత్రం వాస్తవం. కొన్ని ప్రైవేట్ ఫోటోలు కూడా నెట్ లో చక్కర్లు కొట్టాయి. రియా, సుశాంత్ కి దగ్గర అవ్వడం కూడా మహేష్ కి ఇష్టం లేదట. సుశాంత్ కూడా అంతే. మహేష్ తో స్నేహం కట్ చేసుకోవాలని చాలా సార్లు రియాకి మందలించాడు. కానీ రియా మాత్రం మహేష్ నెంబర్ ని డిలేట్ చేయలేకపోయింది. పైగా సుశాంత్ నిర్ణయాలు, చేసే సినిమాల విషయాలు అన్ని కూడా మహేష్ కి చేరవేసేదని గుసగుసలు వినిపించేవి. రియాతో పెళ్లికి ఒప్పుకున్నాడే గానీ ఆమె పట్ల సుశాంత్ ఏమంత ప్రేమగా లేడని, సుశాంత్ ని ట్రీట్ చేసే ఓ వైద్యుడు చెప్పుకొచ్చాడు. ఇక సుశాంత్ చనిపోయిన రెండు రోజులకు ముందే రియా సుశాంత్ ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయింది. అప్పటికే సుశాంత్ చాలా డిప్రెషన్ లో ఉన్నాడట. మహేష్ , రియాకి ఫోన్ చేసి ”వాడో మెంటల్. అక్కడ ఉండొద్దు . వచ్చే” అని సలహా ఇచ్చాడట. ఆ సలహా పట్టుకునే రియా , సుశాంత్ ని వదిలేసి వెళ్ళిపోయిందని కొన్ని కధనాలు వినిపించాయి.
రియా నిర్ణయం సుశాంత్ మరీ క్రుంగదీసిందని అనే వాళ్ళు కూడా వున్నారు. ఈ కేసులో మహేష్ భట్ ని కూడా స్టేషన్ కి విచారణ చేశారు పోలీసులు. విచారణలో ఆయన ఏం చెప్పాడో, వీళ్ళు ఏం రికార్డ్ చేసుకున్నారో బయటికి రాలేదు.
సుశాంత్ కేసు పక్కదారి :
సుశాంత్ ఎందుకు చనిపోయాడు అనేది అతనికి తప్పా ఎవరికీ తెలీదు. అన్నీ వుహాగానలే. బ్రేకింగ్ న్యూస్ లో సుశాంత్ ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. కారణం డిప్రషన్ అని వార్తలు రాసేశారు. అయితే ఆ డిప్రషన్ కి కారణం బాలీవుడ్ అతడిని పట్టించుకోలేదు, గ్రూపులుగా ఏర్పడి ఇతడిని వంటరి చేసింది ఆ బాధ తట్టుకోలేక డిప్రషన్ లోకి వెళ్ళిపోయి, చివరికి ప్రాణం తీసుకున్నాడని కధనాలు ఇచ్చేశారు. దీంతో కొన్ని టీవీ ఛానళ్ళు ‘’నెపోటిజం’’ అని తగులుకున్నాయి. అర్నబ్ గోస్వామి లాంటి జర్నలిస్ట్, కమ్ లాయిర్, కమ్ జడ్జ్.. అయితే తన స్టూడియోలో వాదించి, బ్రోకర్ బాలీవుడ్ అని తీర్పు కూడా పాస్ చేసేశాడు. కరణ్ జోహార్, సల్మాన్ , షారుక్ ఒకటి కాదు.. వీళ్ళంతా సుశాంత్ చావుకి కారణం అన్నాడు. ఇక్కడే పొలిటికల్ ఎజండాని కూడా ప్రవేశపెట్టి .. మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం పీకుతుందని గోల చేశాడు.
ట్విస్ట్ లే ట్విస్ట్ లు :
నెపోటిజం అయిపొయింది. తర్వాత మర్డర్ యాంగిల్. సుశాంత్ ని ప్లాన్ గా మర్డర్ చేశారనే కోణం తెరపైకి వచ్చింది. ఇక కాస్కో .. న్యూస్ ఛానల్స్ ఫారన్సిక్ డిపార్మేంట్ లా పని చేశాయి. సుశాంత్ ఫోటో చూపిస్తూ ఉరి వేసుకుంటే ఆ మచ్చ అలా వుండదు, కళ్ళు ఇలా వుండవు, పెదవులు అలా వుంటాయి .. సుశాంత్ చేతులపై గాయాలు వున్నాయి, స్టూల్ లేకుండా ఫ్యాన్ కి ఎలా ఉరి వేసుకోగలడు .. ఇలా కధనాలే కధనాలు.
కావాలానే మిస్ లీడ్ చేశారా ?
సుశాంత్ ది మొదట ఆత్మహత్య అనుకున్నారు. ఈ దశలో నెపోటిజమ్ తెరపైకి వచ్చింది. తర్వాత మర్డర్ అన్నారు. ఇక్కడే డ్రగ్స్ దందా తెరపైకి తెచ్చారు. దీంతో సుశాంత్ కేసు పక్కదారి పట్టి రియా చుట్టూ కేసు తిరిగింది. రియా, సుశాంత్ ఇద్దరూ డ్రగ్స్ తీసుకునేవారని, వాళ్లకు డ్రగ్ మాఫియాతో సంబంధాలు వున్నాయని కేసులు కేసుల మీద కేసులు పెట్టేశారు. అంతేకాదు .. రియాని అరెస్ట్ చేయడం, ఇంకొంతమంది సెలబ్రిటీలని విచారణకు పిలవడం .. నానా హంగామా జరిగిపోయింది. అయితే సుశాంత్ కేసుని పక్క దారి పట్టించడానికి డ్రగ్స్ ని తెరపైకి తెచ్చారని, సుశాంత్ ని ప్లాన్ గా మర్డర్ చేసిన వారిలో పెద్ద తలకాయలు వున్నాయని, వాళ్ళే కావాలని మొత్తం కేసుని ప్రజల ద్రుష్టి నుంచి మర్చలడానికి డ్రగ్స్ ని తెరపైకి తెచ్చి .. సుశాంత్ కేసు నీరు కార్చేశారని ఓ వాదన వుంది.
ఎన్నో అనుమానాలు:
సుశాంత్ కేసు సిబిఐకి అప్పగించారు. ఈ కేసు పబ్లిక్ డొమైన్ లోనే వుంది కాబట్టి.. మర్డర్ అనడానికి కొన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి. సుశాంత్ చనిపోవడానికి నాలుగు నెలలు ముందే ఓపీ సింగ్ అనే వ్యక్తి ( హర్యానా క్యాడర్ కి చెందిన పోలీసు అధికారి. సుశాంత్ కి బావ వరస) ముంబాయి పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. సుశాంత్ కి ప్రాణ హానీ వుందని, అతడికి రక్షణ కల్పించాలని కోరాడు. అయితే ఈ విషయం పై ముంబాయి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. సుశాంత్ చనిపోయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఏ కారణంతో ఫిర్యాదు చేశాడో తెలియాల్సివుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న రియా వ్యవహార శైలి పై కూడా అనుమానులు వున్నాయి. రియా వచ్చిన తర్వాత సుశాంత్ లైఫ్ స్టయిల్ మరిపోయంది. ఆరు నెలల్లో 50సిమ్ కార్డులు వాడాడట. సుశాంత్ నెంబర్ సొంత తండ్రి కూడా తెలిసేది కాదట. ఫోన్ కి దొరికేవాడు కాదు. ఇంత వింతగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో తెలియాలి. డిప్రషన్ లో వున్న మనిషి ఫోన్ వాడటమే చిరాకు. అలాంటిది ఇన్ని నెంబర్లు ఎందుకు మార్చినట్లు? అప్పటి వరకూ సుశాంత్ ఫ్లాట్ లోనే వున్న రియా, అతడు చనిపోయిన రెండు రోజులకు ముందే ఎందుకు వెళ్ళిపోయింది? డ్రగ్స్ వాడొద్దని రియా చెప్పింది. కానీ సుశాంత్ మాత్రం డ్రగ్స్ ఆపలేదట. దీంతో ఇంక భరించలేక వెళ్ళిపోయిందట. ఇది రియా లాయర్ చెప్పిన మాట. ఈ మాటలో లాయర్ తెలివి కనిపిస్తుంది కానీ నిజం అనిపించడం లేదు. దిశా అనే ఓ లేడీ మ్యానేజర్ సుశాంత్ వద్ద పని చేసేది. రియా వచ్చిన తర్వాత ఆమె కూడా మానేసింది. సుశాంత్ చనిపోయిన ఆరు రోజులు ముందే ఆమె తన ఫ్లాట్ లోనే బాల్కనీ నుంచి జారి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె చావుకి, సుశాంత్ చావుకి ఏమైనా లింక్ ఉందా ? అనే కోణం కూడా తెలియాల్సివుంది.
పోలీసులకు సుశాంత్ ఇంటి ఎదురుగా వుండే సిసి కెమెరా పుటేజ్ దొరకలేదు. కెమెరా వుంది కానీ సరిగ్గా రెండు రోజులకు ముందే ఆ కెమరా పని చేయలేదు. అంతేకాదు.. సుశాంత్ వాడుతున్న ఫోన్, ల్యాప్ ట్యాప్ లో డేటా మొత్తం ఎరైజ్ అయిపొయింది. ఓ ఇద్దరు అగంతకులు సుశాంత్ చనిపోయిన రోజున అతడి ఇంట్లో వున్నారని ముబైల్, ల్యాప్ ట్యాప్ డేటా ని ఎరైజ్ చేసింది వాళ్ళే అని ఓ ప్రచారం వుంది. ఇదే పాయింట్ పై అర్నబ్ గోస్వామి డిబేట్ పెట్టి .. ఇది ప్లాన్డ్ మర్డర్ అని తీర్పు కూడా ఇచ్చేశాడు. అయితే వాస్తవం ఏమిటో తెలియాల్సింది వుంది. ఏదేమైనా సుశాంత్ లేడు. రాడు. కానీ అతడి చావుకి ఇప్పుడు చెబుతున్న కారణం మాత్రం.. శ్రీదేవి బాత్ టబ్ లో మునిగి చనిపోయిందన్నంత సిల్లీగా వుంది. మూడు పెళ్ళిళ్ళు చేసుకొని, ఎఫైర్లు నడిపిన సునంద పుష్కర్, భర్త శశి థరూర్ పెట్టుకున్న ఓ ఎఫైర్ ని భరించలేక విషం తాగేసిందన్నంత లాజిక్ లెస్ గా వుంది. ఒక గ్రూప్ డ్యాన్సర్ గా కెరీర్ ను మొదలుపెట్టి కోట్ల మంది అభిమానం సొంతం చేసుకున్న సుశాంత్ .. తనకు అవకాశాలు తగ్గిపోయాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని డిప్రషన్ లోకి వెళ్లి చివరికి ప్రాణం వదిలేయడం ఎవరికీ నమ్మశక్యం గా లేదు. కారణం ఏదో వుంది. అది కాలం చెబుతుందా ? లేదా కాలంలో కలిసిపోతుందా ? మిస్టరీగానే మిగిలిపొతుందా? ప్రస్తుతానికి ప్రశ్నే.