ఓటీటీ విప్లవం ఎప్పుడో మొదలైయింది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో స్పెషల్ గా ఓటీటీ కోసమే సినిమాల నిర్మాణం జరుగుతుంది. కమల్ హాసన్ లాంటి హీరోలు ఓటీటీ అవసరం గురించి ప్రెస్ మీట్లు పెట్టిమరీ దాని ప్రాముఖ్యత తెలియజేశారు. అప్పట్లో ఆ మోడల్ ఏమిటో చాలా మందికి అవగాహనలోకి రాలేదు. తర్వాత కాలంలో కొద్దికొద్దిగా మార్పు వచ్చింది. అమోజాన్, నెట్ ఫ్లిక్ష్ లాంటి ఓటీటీ సంస్థలు ఇండియన్ మార్కట్ పై ద్రుష్టి పెట్టాయి. దినీకి తోడు జియో విప్లవం మొదలైయింది. మెజార్టీ జనాలకు హై స్పీడ్ ఇంటర్ నెట్ అందుబాటులోకి వచ్చింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఓటీటీ విప్లవానికి నాంది పలికాయి. అయితే కరోనా కష్టకాలంలో మాత్రం ఓటీటీ అంటే ఏమిటో, దాని వలన ప్రయోజనాలు ఏమిటో ప్రాక్టికల్ గా అనుభవంలోకి తెచ్చింది.
కరోనాతో యావత్ ప్రపంచం స్థంభించిపోయింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు ఇది శాపంగా మారింది. నెలల కొద్ది థియేటర్లు తెరచుకోలేదు. తర్వాత థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ క్రౌడ్ ఫులింగ్ కాని పరిస్థితి. దీంతో సినిమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కోట్ల రూపాయిలతో సినిమాలు తీసిన నిర్మాతలు తెచ్చిన పెట్టుబడికి వడ్డీలు కట్టలేక త్రిశంకు స్వర్గంలో పడిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించింది ఓటీటీ. 2021ని రివైండ్ చేస్తే.. దాదాపు సినిమాలని ఓటీటీ ఆదుకుంది.
వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు ఓటీటీ వేదికగానే బయటికి వచ్చాయి. నాని టక్ జగదీశ్ కూడా అమోజన్ ప్రైమ్ లో విడుదల చేశారు. వీటితో పాటు సినిమా బండి, ఎక్ మినీ కధ, ఆకాశవాణి, వివాహ భోజనంభు, పచ్చీస్, సూపర్ ఓవర్ , జగమే తంత్రం, థ్యాంక్ యూ బ్రదర్, జై భీమ్, అద్భుతం సినిమాలు నేరుగా ఓటీటీలోకే వచ్చాయి. రావడమే కాదు.. ఈ సినిమాలన్నీ కూడా లాభాల బాట పట్టాయి. నిర్మాతలకు ఓ రూపాయి మిగిలింది తప్పితే నష్టం లేదు.
నారప్ప, దృశ్యం 2 సినిమాలు రెండు కూడా రీమేకులే. అప్పటికే ఓటీటీల్లో ఈ రెండు సినిమాల ఒరిజనల్ వెర్షన్లు వున్నాయి. సబ్ టైటిల్స్ తో చాలా మంది ఈ సినిమాలన్నీ చూసేశారు. తెలుగులో రిలీజ్ చేస్తే కేవలం వెంకటేష్ కోసమే వెళ్ళాలి. అయితే కరోనా లాంటి క్లిష్ట పరిస్థితిలో కేవలం వెంకీ కోసం జనాలని థియేటర్ లోకి రప్పించడం అంత సులువు కాదు. నిర్మాత సురేష్ బాబుకి ఈ సంగతి తెలుసు. అందుకే మరో ఆలోచన లేకుండా ఓటీటీకి ఇచ్చేశారు. ఈ నిర్ణయంతో సురేష్ బాబు రూపాయి లాభపడ్డారు తప్పితే నష్టం రాలేదు.
నాని టక్ జగదీశ్ ఓటీటీలోకి రావడం పెద్ద సర్ ప్రైజ్. నానికి థియేటర్ మార్కట్ వుంది. దర్శకుడు శివ నిర్వాణ మంచి ఫామ్ లో వున్నాడు. పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమాని థియేటర్ లో రిలీజ్ చేస్తారనే అనుకున్నారంత. కానీ సడన్ గా ఓటీటీలో వదిలేశారు. సినిమా చూసిన తర్వాత ఓటీటీ లో రిలీజ్ చేయడమే బెస్ట్ అనే రివ్యూ వచ్చింది. రివ్యూ సంగతి అలా వుంచితే.. టక్ జగదీశ్ లాంటి సినిమా కూడా నేరుగా ఓటీటీలోకి రావడంతో అసలు ఓటీటీ ఎంత పెద్ద బిజినెస్ మీడియం అనే సంగతి అర్ధమైయింది. కంటెంట్ కోసం కోట్లు పెట్టడానికి కూడా సిద్దంగా వున్నాయి ఓటీటీ సంస్థలు. నేరురా ఓటీటీలో రావడం వలన నాని నిర్మాతలకు రూపాయి మిగిలింది తప్పితే నష్టం రాలేదు. ఓటీటీ మార్కట్ ఎంత పెద్దదో చెప్పడానికి జగమే తంత్రం, జై భీమ్ సినిమాలు మంచి ఉదారణలు. ధనుష్, సూర్య.. పాన్ ఇండియా హీరోలు. వాళ్ళు సినిమాలు నేరుగా ఓటీటీకి వెళ్ళిపోవడం ఒక్కింత సర్ప్రైజ్. కానీ సినిమా అనేది ఫైనల్ గా బిజినెస్ ప్రోడక్ట్. ఆ రెండు సినిమాలు ఓటీటీలోకి రావడంతో లాభాలు బాట పట్టాయి.
సినిమా బండి, ఎక్ మినీ కధ, ఆకాశవాణి వివాహ భోజనంభు, పచ్చీస్, సూపర్ ఓవర్,, అద్భుతం సినిమాలకు ఓటీటీ వరంగా మారింది. తమ కంటెంట్ బ్యాంక్ ని పెంచుకోవడానికి ఓటీటీ సంస్థలు ఈ సినిమాల కొనుక్కున్నాయి. ఈ సినిమాలు నేరుగా థియేటర్ లోకి వచ్చివుంటే రూపాయి వెనక్కి వేసుకునే పరిస్థితి ఉందా అంటే సమాధానం ప్రశ్నార్ధం. కానీ నేరుగా ఓటీటీని ఆశ్రయించి లాభం పొందాయి.
చిన్న, మీడియా సినిమాలకు ఓటీటీ వరమే. అయితే నిర్మాతలు కొంచెం తెలివిగా అలోచించాల్సిన అవసరం వుంది. తాజాగా గమనం అనే సినిమా వచ్చింది. నెట్ ఫ్లిక్స్ మూడున్నర కోట్ల రూపాయిలకి సినిమాని అడిగింది. కానీ నిర్మాతలు థియేటర్ లోకి వచ్చారు. థియేటర్ లో సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో నిర్మాతలు చేతులు కాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చేసివుంటే నిర్మాతలు సేఫ్ జోన్ కి వెళ్ళిపోయేవారే.
అయితే ఓటీటీకి కంటెంట్ అమ్మడం కూడా అంత సులువు కాదు. ఇప్పుడు క్యాలిటీ, నియమాలు మరింత క్లిష్టం చేశాయి ఓటీటీలు. సినిమాలో స్టార్ వాల్యువుండాలి, స్టార్ టెక్నిషియన్స్ వుండాలి, విజువల్ క్యాలిటీ బావుండాలి.. గమనం సినిమాలో కూడా ఇవన్నీ కుదిరాయి.. శ్రియా, నిత్య, ప్రియాంక జవల్కర్, శివ కందుకూరి, సుహాష్… వీళ్ళంతా ప్రామెసింగ్ యాక్టర్లు, మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ వుంది. సాయి మాధవ్ బుర్రా మాటలు… ఇవన్నీ ఓటీటీని ఆకర్షించాయి. గమనం నిర్మాతలు కొంచెం తెలివిగా వ్యవహరించి బావుండేది. భవిష్యత్ లో ఓటీటీ కోసం కంటెంట్ రెడీ చేసే రూపకర్తలు కూడా ఇలాంటి కొలమానాలని ద్రుష్టిలో పెట్టుకొని సినిమాలు నిర్మిస్తే.. నిర్మాతలకు లాభాలు ఇచ్చి కంటెంట్ ని తీసుకోవడానికి ఓటీటీ సంస్థలు సిద్దంగా వున్నాయని ఈ ఏడాదితో ప్రాక్టికల్ గా రుజువైయింది.