కాలం చాలా బలమైనది. చాలా భయంకరరమైనది కూడా. ముఖ్యంగా తిరుగులేదని విర్రవీరే నియంత్రాలకు కాలమే వారి ప్లేస్ వారికి చూపిస్తుంది. 2024 అలాంటి బలమైన కాలాన్ని కొంత మంది నియంతలకు మళ్లీ చూపించింది. 30 ఏళ్ల పాటు తానేనని విర్రవీగిన జగన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది 2024 ఏడాది. జూన్ నెల వచ్చే వరకూ వైసీపీ, జగన్ గాల్లోనే ఉంటారు. పోలింగ్ ముగియగానే లండన్ వెళ్లారు. అక్కడా ఆయనేదో పై నుంచి దిగి వచ్చారని మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టేసీన్లు ఏర్పాటు చేసుకున్నారు. కానీ జూన్ మూడో తేదీన జగన్‌ది, వైసీపీ బలుపు కాదని కేవలం వాపేనని తేలిపోయింది. ఆ రోజు వాపు తగ్గిపోవడంతో అథ:పాతాళానికి పడిపోయారు.
ఈ ఏడాది ఆరంభంానికే జగన్ రెడ్డికి తనుకు ఘోరమైన ఫలితాలు రాబోతున్నాయన్న సంకేతాలు చూశారు. అంతకు రెండు నెలల ముందు జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరపరాజయాలతోనే ఆయనకు తర్వాత పీడకలు రావడండ ఖాయమని తేలిపోయింది. కానీ మా ఓటర్లు వేరే ఏ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అందర్నీ మభ్య పెట్టే ప్రయత్నం చేయడంతో ఇంకా ఎక్కువ తప్పిదం జరిగింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రారంభమైన జగన్ కష్టాలు విజయవాడలో చిన్న రాయితో కొట్టారని చేసిన రాజకీయం నవ్వుల పాలయింది.
పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించి ఏదో చేద్దామనుకున్నారు కానీ అదీ తేడా కొట్టింది. చివరికి ప్రతిపక్ష హోదా కూడా రానంత ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన నాలుగో వారం నుంచే.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమయిందని పాట అందుకున్నారు. అది అలా కొనసాగుతోంది. మరో వైపు ఐదేళ్ల పాలనలో చేసిన నిర్వాకాల ప్రతిఫలం ఆ పార్టీ నేతలు అనుభవిస్తున్నారు. సీనియర్లు ఎవరూ బయటకు రావడంతో చాలా మంది పారిపోయారు. అంబటి రాంబాబు ఒక్కడే బయట కనిపిసతున్నారు.
పార్టీని వీడియో నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎవరూ ఆగడం లేదు. సీనియర్లు సైలెంట్ గా ఉంటున్నారు.దీంతో పార్టీ ఉన్నా యాక్టివ్ గా ఉండటం లేదు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు రాజీనామా బాటలో ఉన్నారు. జగన్ రెడ్డి మర్చిపోవాలనుకున్న ఏడాది .. టైం ఏదైనా ఉందంటే అది 2024 మాత్రమే. ఎప్పుడూ మర్చిపోలేని పీడకలలను ఈ ఏడాది తీసుకు వచ్చిందని అనుకోవచ్చు.