హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి దేశంలోనే ప్రత్యేకత ఉంది. ఇక్కడ వ్యాపారం ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకే దిగ్గజ పెట్టుడిదారులంతా హైదరాబాద్ లో తమ ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది చాలా వరకూ ఇలాంటి వారందరికీ నష్టాలు తేకపోయినా భారీగా లాభాలు అయితే తెచ్చిపెట్టలేదు.
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ స్లంప్ ఉండటం.. హైదరాబాద్ లో హైడ్రా కారణంగా మధ్యతరగతి ప్రజలుకూడా ఇళ్ల కొనుగోలుకు వెనుకడుగు వేయడంతో సమస్యలు వచ్చాయి. నిర్మాణంలో లక్షకుపైగా ఇళ్లు ఉన్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్యలకు తోడు బడా బిల్డర్లు అంతానేల విడిచిసాము చేస్తున్నారు. కేవలం లగ్జరీ గృహాలే నిర్మిస్తున్నారు. దీంతో మధ్యతరగతి ఇళ్లకు డిమాండ్ ఉన్నా మార్కెట్ తగ్గిపోయింది.
బుకింగులు తగ్గిపోవడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్నారు. కొన్ని బడా కంపెనీలు తమ ప్రాజెక్టుల్ని స్లో చేశాయి. బుకింగులు భారీగా ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అయితే ఇయర్ ఎండింగ్ కు పరిస్థితి చక్కబడిన సూచనలు కనిపిస్తున్నాయి. హైడ్రా దూకుడు ఇక ముందు ఉండబోదని సంకేతాలు వచ్చాయి. వచ్చే ఏడాది కొత్త ఆర్బీఐ గవర్నర్ వడ్డీరేట్లు తగ్గిస్తే డిమాండ్ పుంజుకునే అవకాశం ఉంది.