ఈ వారం సుప్రీమ్, 24 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. సుప్రీమ్ రొటీన్ యాక్షన్ డ్రామాగా నిలబడింది. రివ్యూల్లో కూడా ఈసినిమాకి కేవలం పాస్ మార్కులేశారు. 24ని ఓ బ్రిలియెంట్ ఐడియాగా సినీ విశ్లేషకులు కీర్తిస్తున్నారు. రివ్యూల్లో కూడా ఎక్కువ స్టార్లే పడ్డాయి. అయితే ప్రమోషన్ల విషయంలో దిల్‌రాజు.. సుప్రీమ్ ని నిలబెట్టారు. ఆ స్థాయిలో 24ని ప్రమోషన్లు దొరకడం లేదు. డబ్బింగ్ సినిమా కావడం వల్ల, తెలుగులోనూ జ్ఞానవేల్ రాజా నే ఈ సినిమాని సొంతంగా విడుదల చేయడం వల్ల… తెలుగులో ఈ సినిమాని పట్టించుకొనేవాళ్లే లేకుండా పోయారు.
వసూళ్ల పరంగా బీసీల్లో సుప్రీమ్కి మంచి ఆదరణ దక్కుతోంది. తొలి వారంతంలో దాదాపుగా 16 కోట్లు సాధించిందట. సూర్య మూడు రోజుల్లో ఇన్నే వసూళ్లు దక్కించుకొంది. బీసీల్లో సుప్రీమ్ హవా చూపిస్తున్నాడు. మల్టీప్లెక్స్‌లలో, ఏ సెంటర్లలలో సూర్య సినిమా దుమ్ము రేపుతోంది. అలా.. ఏబీసీ సెంటర్లని ఈ రెండు సినిమాలూ పంచుకొన్నాయి. ఈవారం పెద్దగా సినిమాల తాకిడి లేదు. 20న బ్రహ్మోత్సవం రాబోతోంది. అప్పటి వరకూ ఈ రెండు సినిమాలూ నిలబడగలిగితే… గట్టెక్కేయొచ్చు.