అందరిదీ ఒక దారయితే ఉలిపి కట్టేది మరోకదారన్నట్లు, అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ నోటి దురుసుతనం చూసి, యావత్ ప్రపంచ దేశాలు విమర్శిస్తుంటే. మన రాం గోపాల్ వర్మకి మాత్రం ఆయన అమెరికా చరిత్రలోనే గొప్ప అధ్యక్షుడుగా నిలిచిపోయే వ్యక్తిగా కనబడుతున్నారుట. అది కూడా అబ్రహం లింక, జాన్ ఎఫ్ కెనడీలంత గొప్ప అధ్యక్షుడుగా గుర్తింపు తెచ్చుకొంటారని తన తాజా ట్వీట్ మెసేజులో అభిప్రాయం వ్యక్తం చేసారు.
డోనాల్డ్ ట్రంప్ మీద వర్మకి అంత గొప్ప అభిప్రాయం ఎలా కలిగిందో కూడా అయన వివరించి ఉండి ఉంటే బాగుండేది. వర్మ ఆయనను మెచ్చుకొన్న సమయంలోనే ఆయన మళ్ళీ ముస్లింల పట్ల చాలా అవమానకరమైన వ్యాఖ్యలు చేసారు. అమెరికాలోకి ముస్లింలను రానివ్వకూడదని, దేశంలో ఉన్న అక్రమ వలసదారులను అందరినీ తక్షణమే వెనక్కి త్రిప్పి పంపేయాలని అన్నారు.