ఆహా ఓటీటీ ఆరంభ సభలోనే ఇందులో హాట్ కంటెంట్ ఉండబోతుందని చెప్పారు అల్లు అరవింద్. ఆయన చెప్పినట్లే ఆహాలో అడల్ట్ కంటెంట్ రోజురోజుకి పెరుగుతుంది. తాజాగా ఆహాలో వదిలన ‘త్రీ రోజెస్’ ట్రైలర్ లో వీరనాటుగా మసాలా దట్టించారు. పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రలో తెరక్కిన వెబ్ మూవీ త్రీ రోజెస్ . ఈ ట్రైలర్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే పెళ్లి, సెక్స్, రొమాన్స్ చుట్టూ తిరిగింది. బోనస్ గా అడల్ట్ డైలాగులు కూడా వినిపించాయి.
అప్పుడే పెళ్లి వద్దు అనుకునే ఓ అమ్మాయి.. పెళ్లి కాకుండానే సెక్స్ ని ఎంజాయ్ చేసే ఇంకో అమ్మాయి.. ఇంకా పెళ్లి కావడం లేదని బాధపడే మరో అమ్మాయి.. ఈ ముగ్గురి జీవితాలని త్రీ రోజెస్ గా చూపించారు. ట్రైలర్ లో కావాల్సినంత హాట్ నెస్ నింపేశారు. తల్లితో కూతురు అనరాని ఓ మాట, వైవా హర్ష కామెడీ .. అంతా సెన్సార్ కంటెంట్ నే. ఐతే ఓటీటీ కి ఆ సమస్య లేకపోవడంతో ఇబ్బంది లేదు. ఇక ట్రైలర్ చివర్లో అమ్మాయిల అస్తిత్వం, ఫ్రీడమ్ గురించి ఓ మెసేజ్ కూడా చూపించారు. రేపటి నుంచి ఈ సినిమా ఆహా లో ప్రసారం కానుంది.