విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి దాడి ఘటన తర్వాత… దాదాపు పదిహేను రోజుల విశ్రాంతి తీసుకుని జగన్ … పాదయాత్ర ప్రారంభించారు. అయితే… ఈ పాదయాత్ర తొలి రోజు అత్యంత నిస్సారంగా గడిచింది. దానికి కారణం.. పోలీసుల భద్రత. జగన్ చుట్టూ మూడంచలె భద్రతను ఏర్పాటు చేశారు. ఎవర్నీ దగ్గరకు పోనీయడం లేదు. భద్రతలో ఉన్న పోలీసులకు సైతం గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. మూడు దశలలో ఉన్న పోలీసులకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో ఉన్న గుర్తింపు కార్డులు జారీ చేశారు. జగన్ చుట్టూ మూడు వలయాలుగా పోలీసులు అనుక్షణం డేక కళ్లుతో జగన్ను కాపలా కాస్తున్నారు.
సాధారణంగా జగన్ పాదయాత్రలో ఓ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఏ సమయంలో ఎవరు వచ్చి కలవాలి.. ? ఎవరు వచ్చి పాదం కలపాలి..? ఎవరు సెల్ఫీలు తీసుకోవాలి..? . ఓ వికలాగుండు.. ఓ వృద్ధురాలు…మరో మహిళ.. ఇలా.. ఓ సీక్వెన్స్ ఉంటుంది. వీరికి అంతకు ముందు పోలీసుల అనుమతి అవసరంలేదు. కానీ ఇప్పుడు.. జగన్ దగ్గరకు వెళ్లాలంటే.. కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోంది. అలాగే.. అందర్నీ పంపడంలేదు. చాలా పరిమితంగానే జగన్ వద్దకు పంపుతున్నారు. జగన్ ఒక ఊరు నుండి మరో ఊరు చేరే లోగా రెండు గ్రామాన్ని కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. పాద యాత్ర చేస్తున్న గ్రామాన్ని, చేయబోతున్న గ్రామాన్ని డ్రోన్ కెమేరాలతో పర్యవేక్షిస్తున్నారు. అనుమానం ఉన్న వారిపై పూర్తిగా నిఘా పెట్టి, సోదాలు చేస్తున్నారు.
జగన్ కలవటం కోసం ముందుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యంత భారీ భద్రత కల్పించడం.. వైసీపీ నేతలకు సంతోషాన్ని ఇస్తుంది కానీ.. ..ఈ భద్రత వల్ల పాదయాత్ర లక్ష్యం దెబ్బతింటోందని బాధపడుతున్నారు. ప్రజలను దగ్గరకు రానీయకుండా.. వారి దగ్గరకు వెళ్లకుండా ఏం ప్రయోజనం అని నిట్టూరుస్తున్నారు. పులివెందుల నుంచి విజయనగరం వచ్చే వరకూ రాని సెక్యూరిటీ .. సమస్య పాదయాత్ర చివరికి వచ్చే సరికి తెచ్చి పెట్టుకుని.. లేని పోని తంటాలు పడుతున్నామని.. వైసీపీ నేతలు… బాధపడుతున్నారు. ఇప్పుడు పూర్తిగా.. జగన్ పాదయాత్ర పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయిందని.. వారు మథనపడుతున్నారు.