తాడేపల్లిలోని జగన్ ఇల్లు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుది.. రెండు ఎకరాల చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే. వ్యూ కట్టర్స్ పేరుతో వాటిని ఏర్పాటు చేసి బిల్లులు వసూలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో ఏ ఇంటికి అంత భారీ ఎత్తున ఇనుప పరదాలు ఉండవు. కానీ జగన్ రెడ్డికి మాత్రం… తన ఇంట్లోవి ఏవీ బయటకు బయటకు కనపడకూడదని అలా ఏర్పాటు చేసుకున్నారు.
నిబంధనల ప్రకారం అనుమతి ఉంటే… ఆయన సొంత సొమ్ముతో కట్టుకుంటే ఆయనిష్టం. కానీ ప్రజాధనంతో సొంత ఇంటికి ఏర్పాటు చేసుకున్నారు. అదీ కూడా రహస్య జీవోలతో పని పూర్తి చేశారు. జగన్ రెడ్డికి అంత భయం ఎందుకో కానీ.. సెక్యూరిటీ పరంగా ఆయన తీసుకునే జాగ్రత్తలకు కోట్లు ఖర్చవుతూంటాయి.
సీఎం కుటుంబానికి విదేశాల్లోనూ భారీ భద్రత కావాలని ఆయన చట్టం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా లేకుండా పోయింది. ఐదేళ్ల పాటు తన సొంత ఖర్చుల కోసం ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లుగా దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కటి బయటకు వస్తోంది.