వృద్ధుల పెన్షన్ల కేంద్రంగా వైసీపీ చేసిన రాజకీయం పుణ్యమా అని 33 మంది వృద్ధులు బలైపోయారు. మూడో తేదీ నుంచే పెన్షన్లు ఇస్తామని వారం రోజుల ముందుగా చెప్పినా.. వాలంటీర్ల ద్వారా వద్దని ఈసీ ఇచ్చిన ఆదేశాలతో రాజకీయం చేద్దామనుకున్నారు. అత్యంత ఘోరమైన క్షుద్ర రాజకీయం చేశారు. వృద్ధులను మానసికంగా టార్చర్ పెట్టారు. సచివాలయాల వద్దకు పరుగులు పెట్టేశారు. చివరికి 33 మంది వృద్ధులు చనిపోతే వారి కేంద్రంగా రాజకీయాలు చేశారు. శవాలతో ఊరేగింపులు కూడా చేయాలనుకున్నారు. మరి ఈ 33 మంది మృతికి ఎవరు బాధ్యత వహిస్తారు ?
ఖజానాలో ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు దోచి పెట్టేసి.. అవ్వాతాతల పెన్షన్లకు మాత్రం .. అప్పుల మీద ఆధారాపడ్డారు. దీన్ని కవర్ చేసుకోవడానికి వారి ప్రాణాలకు ముప్పు తెచ్చే రాక్షాస రాజకీయం చేశారు. మూడో తేదీ నుంచి అందరికీ ఇస్తాం.. ఎవరూ కంగారు పడవద్దు అని సమాచారం ఇస్తే ఒక్కరైనా బయటకు వచ్చే వారు కాదు. కానీ.. అందరిలోనూ పానిక్ సృష్టించారు. వృద్ధుల ప్రాణాలు పోవాలని వాటితో తాము రాజకీయాలు చేయాలని లెక్కలేసుకున్నారు. ఇలా కూడా ఆలోచిస్తారా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.
వృద్ధుల శవాల కోసం కాచుకు కూర్చున్న వైసీపీ నేతలు కావాల్సినంత రాజకీయం చేశారు. కానీ వారి తీరు చూసి తోడేళ్లే నయం అనుకోని జనం లేరనే సంగతిని మాత్రం వారు గుర్తించలేకపోయారు. వృద్ధుల ప్రాణఆలను తీసి.. వారి శవాల మీదుగా చేసిన రాజకీయంతో అధికారం వస్తుందని అనుకున్నారు. కానీ మరింతగా పాతాళానికి పడిపోయారు. బయటకు లాగినా రాలేనంత లోపలికి దిగజారిపోయారు.